తెలుగు రాష్ట్రాల పోలీసులకు గృహమంత్రి దక్షతా పదక్ అవార్డులు
ఢిల్లీ (CLiC2NEWS): తెలుగు రాష్ట్రాల పోలీసులకు కేంద్రీయ గృహమంత్రి దక్షతా పదక్ పురస్కారాలు ప్రకటించారు. ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్బంగా కేంద్ర హోంశాఖ ఈ ఏడాదికిగాను 463మంది పోలీసు సిబ్బందికి అవార్డులను ప్రకటించింది. ప్రత్యేక ఆపరేషన్లు, దర్యాప్తు, ఫోరెన్సిక్ సైన్స్ తదితర విభాగాల్లో అసాధారణ ప్రతిభ కనబరిచిన వారికి పురస్కారాలు అందజేసింది.
తెలుగు రాష్ట్రాల్లో ఎపి నుండి ఇద్దరు ఎస్పిలు, తెలంగాణ నుండి ఒక ఎస్పితో పాటు పలువురు కానిస్టేబుళ్లకు ఈ పురస్కారాలు అందుకున్నారు.