ఇళ్లు కోల్పోయిన వారికి ‌5సెంట్ల స్థలంలో ఇల్లు: సిఎం జగన్

చ‌నిపోయిన వారి కుటుంబాల్లో ఒక‌రికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగం

 

క‌డ‌ప‌(CLiC2NEWS): ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇటీవ‌ల కుర‌సిన భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌లు కార‌ణంగా ఇళ్లు కోల్పోయిన వారికి ‌5సెంట్ల స్థలంలో ఇల్లు న‌ర్మించి ఇస్తామ‌ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. గురువారం సిఎం వ‌ర‌ద బాదిత ప్రాంతా‌ల‌లో ప‌ర్య‌టించి, బాధితుల‌ను ప‌రామ‌ర్శించారు. చ‌నిపోయిన వారి కుటుంబాల్లో ఒక‌రికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇస్తామ‌ని చెప్పారు. వ‌ర‌ద‌ల కార‌ణంగా తీవ్ర నష్టం జ‌రింగిందని, న‌ష్ట‌పోయిన రైతులంద‌రికీ ప‌రిహారం ఇస్తామ‌ని తెలిపారు.

పొలాల్లో ఇసుక మేట‌లు తొల‌గించ‌డానికి హెక్టారుకు రూ. 12 వేలు ఇస్తామ‌ని తెలిపారు. వరదల వల్ల 293 ఇళ్లు కొట్టుకుపోయాయని, ఇళ్లు కోల్పోయిన వారికి ‌5సెంట్ల స్థలంలో ఇల్లు న‌ర్మించి ఇస్తామ‌ని అన్నారు. వరద సహాయ కార్యక్రమాల్లో అధికారులు అద్భుతంగా పని చేశారని సిఎం జగన్‌ కొనియాడారు.

 

Leave A Reply

Your email address will not be published.