కార్టూనిస్ట్ భూపతికి హోప్ 21.. అన్ఫోల్డ్ డ్రీమ్స్ అవార్డు
జాతీయ స్థాయి కార్టూన్ పోటీలో ద్వితీయ బహుమతి.

హైదరాబాద్ (CLiC2NEWS): క్లిక్2 న్యూస్ కార్టూనిస్టు తునికి భూపతికి హోప్ 21..అన్ఫోల్డ్ డ్రీమ్స్ అవార్డు వరించింది. హోప్ 21..అన్ఫోల్డ్ డ్రీమ్స్ సంస్థ జాతీయ స్థాయిలో నిర్వహించిన కార్టూన్ పోటీలో వివిధ రాష్ట్రాలనుండి వందల సంఖ్యలో కార్టూనిస్టులు పంపిన కార్టూన్లతో పోటీ పడినారు. ఈ పోటీలలో మన తెలంగాణ నుండి ప్రత్యేకంగా మన కరీంనగర్ కు చెందిన ప్రముఖ కార్టూనిస్ట్, శంకరపట్నం మండలంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా, క్లిక్2న్యూస్ కార్టూన్లు వేస్తున్న తునికి భూపతికి ద్వితీయ బహుమతి పొందారు. ఇప్పటికే భూపతి కార్టూన్లతో తెలుగు ప్రజలను అలరిస్తున్నారు. భూపతి కార్టూన్లు అనేక అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర స్థాయిలో అనేక బహుతులు సాధించి… పలువురు ప్రముఖుల చేత సన్మానింపబడ్డారు.
