ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది కరోనా రోగులు మృతి

ముంబయి (CLiC2NEWS): మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఆసుపత్రికి చెందిన ఐసియులో మంటలు చెలరేగడంతో 10 మంది కరోనా రోగులు సజీవదహనమయ్యారు. ఈ ప్రమాదంలో మరో 11 మంది రోగులు తీవ్రంగా గాయపడ్డారు. ఇవాళ (శనివారం) ఉదయం 11.30 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఐసియులో చికిత్స పొందుతున్న 17 మందిలో 10 మంది అక్కడికక్కడే సజీవదహనం అయ్యారు. విషయంతెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు.
ప్రమాదం జరిగిన సమయంలో కోవిడ్ వార్డులో 17 మంది రోగులు ఉన్నారు. మొదట్లో అగ్నిప్రమాదంలో 10 మంది రోగులు మరణించగా తీవ్రంగా గాయపడిన ఏడుగురిని ఆసుపత్రికి తరలించారు. ఆ ఏడుగురిలో ఒక రోగి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 11కి చేరింది.
మృతులను బక్తాపూర్లోని షెవ్‌గావ్‌కు చెందిన సీతారాం దగ్దు జాదవ్ (83), పార్నర్‌లోని కిన్హి గ్రామానికి చెందిన భివాజీ సదాశివ్ పవార్ (80), నెవాసాలోని మాకా గ్రామానికి చెందిన రామ్‌కిసన్ విఠల్ హర్పుడే (70), కేద్గావ్‌లోని కొండబాయి మధుకర్ కదం (70)గా గుర్తించారు. , శెండికి చెందిన చబాబీ అహ్మద్ సయ్యద్ (65), నెవాసలోని తెల్కుడ్‌గావ్‌కు చెందిన సత్యభామ శివాజీ ఘోడ్‌చౌరే (65), నెవాసలోని పథర్‌వాలాకు చెందిన కడుబల్ గంగాధర్ ఖాటిక్ (65), షెవ్‌గావ్‌కు చెందిన అస్రాబాయి గోవింద్ నంగారే (58), షెవ్‌గావ్‌కు చెందిన దీపక్ విశ్వనాథ్ జగదలే (37) సంగం 58 ఏళ్ల వ్యక్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
గాయపడి న వారిలో పాతర్డికి చెందిన లక్ష్మణ్ విఠల్ థోరట్ (85), నెవాసకు చెందిన రమాబాయి పంజరం విధాతే (70), శ్రీగొండకు చెందిన గోదాబాయి పోపట్ ససానే (70), కేద్గావ్‌కు చెందిన యమునా తాత్యారామ్ కాంబ్లే (65), లక్ష్మణ్ అస్రాజీగా గుర్తించారు. శేవ్‌గావ్‌కు చెందిన సావల్కర్ (60), బీడ్‌కు చెందిన సంతోష్ ధర్మాజీ థోకల్ (40), రాహురికి చెందిన అంకుష్ కిసాన్ పవార్ (40). వారిలో ఒకరు మరణించగా, మరో ఆరుగురి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది.