విటమిన్ `D `లోపాన్ని అధిగ‌మించాలంటే..

మానవ జీవనానికి ఆహారం కావాలి. మనం సేవించిన ఆహారం చక్కగా జీర్ణం కావాలి. అది శరీరానికి వంట పట్టాలి. అప్పుడే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. మనం సేవించే ఆహారంలో శరీరానికి కావాల్సిన న్యూట్రియాంట్లు కావాలి.  అవి ప్రోటీన్లు, (మాంసకృత్తులు )కార్బొ హైడ్రెట్లు (పిండి పదార్దాలు )ఫ్యాట్ (కొవ్వు ) మినరల్స్, మరియు విటమిన్స్ ఇవన్నీ సమంగా వుండే ఆహారమే బాలన్స్డ్ డైట్ అంటారు.

ఈ మధ్య కాలంలో చాలా మందికి ఎముక రోగాలు, ఇతర డి విటమిన్ లోపం వలన వచ్చే రోగాలు ఎక్కువ అయినాయి. మరి డి విటమిన్ తగ్గితే ఏ ఆహారం తీసుకుంటే డి విటమిన్ పుష్కలంగా అందుతుందో తెలుసుకుందాం…

  • ఒకవేళ వెజిటేరియన్ అయితే ఈ పదార్దాలు తినాలి. పాలు, ఓట్స్, ఆరంజ్, మష్రూమ్, పెరుగు, లో డి విటమిన్ ఉంటుంది. మీరు రోజు తీసుకునే ఆహారంలో ఇవి తప్పకుండా ఉండేలా చూసుకోవాలి.
  • శరీరం ఆరోగ్యవంతముగా ఉండాలంటే చక్కని ఆహారం తీసుకోవటానికి డైట్ and ప్లాన్ చేసుకోవాలి.
  • విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, మరియు ఏమినో ఆసిడ్స్, పుష్కలంగా వున్నవి తినాలి.
  • శరీరము బలంగా ఉండటానికి, మరియు ఇమ్మ్యూనిటి పవర్ పెంచుకోవటానికి విటమిన్ డి చాలా అవసరం వుంది.

నేటి రోజులలో పిల్లలు, పెద్దలు, యువకులు, యువతులు, అందరు తినే ఆహారంలో లైఫ్ స్టయిల్ లో చాలా మార్పులు రావటం జరిగింది. అసలు కొంతమంది రాత్రి పూట, కొంతమంది పగటి పూట ఇంట్లో వండిన ఆహారం సరిగ్గా తింటం లేదు. దీనికి కారణం హడాహుడి జీవితం, పిల్లలు స్కూల్ కి పోవాలని, తల్లితండ్రులు ఉద్యోగానికి పోవాలని, మరి కొంతమంది సెల్ phone లో వీడియో గేమ్స్ ఆడాలని, కొంతమంది బజారులో తినటం అలవాటుపడి పూర్తిగా food లైఫ్ స్టయిల్ మారిపోయింది. కొంతమంది బరువు తగ్గాలని డైట్ చేస్తుంటారు. ఇలానే గాక రోడ్డు మీద దొరికే పిజ్జా, బర్గర్, నూడుల్స్, ఆలు చిప్స్, స్నాక్స్, మ్యాగీ, తినటం,కూల్ డ్రింక్స్, ఆల్కహాల్, తాగటం. రాత్రి త్వరగా నిద్రుపోక, తెల్లవారుజామున త్వరగా మేలుకొక పోవటం, సూర్య కిరణాలు శరీరానికి తగలక పోవటం, software, పెద్ద పెద్ద ఎయిర్ కండిషన్ ఆఫీసులో పనిచేయడం వలన డి విటమిన్ శరీరానికి అందకపోవటం, హార్మోన్స్ ఇంబాలన్స్ వలన, థైరాయిడ్,ఇంకా తదితర వాటి వలన డి విటమిన్ లోపం వస్తుంది.

డి విటమిన్ లోపాన్ని ఈ ఆహారం ద్వారా పూర్తించగలరు.

ప్రతిరోజు ఉదయం 11 గంటల వరకు ఎండలో ఉండటం లేదా శారీరక శ్రమ చేయటం, సూర్యకిరణాలతో శరీరంలో విటమిన్ డి తయారు అవుతుంది.     ఒకవేళ ఎండకు విటమిన్ డి సరిగా అందకపోతే ఆహారం ద్వారా కూడా దానిని పూరించుకోవచ్చును.

  • పాలు… పాలలో పోషకతత్వాల బండారం. పాలలో విటమిన్ డి, మరియు కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఆవు పాలు తాగితే ఇంకా చాలా  మంచిది. ఈ విధంగా ప్రతిరోజు ఒక గ్లాస్ పాలు తాగి విటమిన్ డి ని పొందండి.

  •  పెరుగు… రోజు పెరుగు తినటం వలన విటమిన్ డి ని పొందవచ్చును. దీనిలో కాల్షియం కూడా ఉంటుంది. ఎముకలు పటిష్టంగా మారుతాయి.          కడుపు కూడా ” ఫిట్ ” గా ఉంటుంది.

  • ఆరంజ్…. చాలా మంది సంత్రా తింటే విటమిన్ సి లభిస్తుంది అంటారు. కానీ విటమిన్ డి కూడా లభిస్తుంది. దీని juice తాగవచ్చును మరియు       తింటే ఇంకా విటమిన్ డి బాగా లభిస్తుంది.

  • గ్రేన్స్… దీన్లో విటమిన్ డి తక్కువగా ఉంటుంది. విటమిన్ డి లోపాన్ని గోధుమలు, ఓట్స్, ద్వారా కూడా అందుతుంది.

-షేక్.బహర్ అలీ

ఆయుర్వేద వైద్యుడు

Leave A Reply

Your email address will not be published.