ఎపి ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. హెచ్ఆర్ఎ పెంపు
అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ అందించింది. కొత్త జిల్లాలలోని ఉద్యోగులకు హెచ్ ఆర్ ఎ పెంచాలని జగన్ సర్కార్ నిర్ణయించింది.
హెచ్ ఆర్ ఎను 12% నుండి 16% వరకు పెంచుతూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెరుగుదల రాష్ట్రంలోని కొత్త జిల్లాల హెడ్ క్వార్టర్స్‌లో పనిచేసే ఉద్యోగులకు వర్తించనుంది. అమలాపురం, బాపట్ల, రాజమండ్రి, పార్వతీపురం, పాడేరు, భీమవరం, నరసరావుపేట, పుట్టపర్తి, రాయచోటి జిల్లా కేంద్రాల్లో ఉద్యోగులకు ఈ పెంపు వర్తించనున్నట్లు సమాచారం.