విజయుడు (ధారావాహిక న‌వ‌ల‌ పార్ట్‌-23)

భుజంగ రావు హోటల్‌ను ప్రతిపాదించడంలో విజయ్ ఆలోచన వేరు. అక్కడ సంఘ వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయని, క్యారే, పేకాట వంటి జూదం కూడా ఆయన నిర్వహిస్తున్నారని విజయ్‌కు ఉన్న సమాచారం. అందుకే ఆయన ెటల్ ఎప్పుడూ రద్దీగా ఉంటుందని, పెద్ద విస్తీర్ణం ఉన్నందున ఏ విభాగానికి ఆ విభాగం ఉండటంతో ఎవరికీ అనుమానం రావడం లేదని, కుటుంబ సమేతంగా భోజనానికి వచ్చే వారికి ఈ విషయాలేవీ తెలియకుండా ఈ సెక్షన్ వేరుగా ఉంటాయి. వచ్చిన వారికి ఏ లోటుకాకుండా చర్యలు తీసుకుంటూ భుజంగ రావు వ్యాపారంలో బాగా పుంజుకున్నాడనేది ఆయనపై ఆరోపణలు. తాను ఒక్కడినే ఈ ెల్‌కు వెలితే కూఫీ లాగడానికి వచ్చానని భుజంగ రావు అనుమానిస్తాడని, ఆయనకు ఫ్రెండ్‌ అయిన కోటేశ్వర రావు కుటుంబంతో సహా వస్తే అంతా సజావుగా సాగిపోతుందని విజయ్ అభిప్రాయం. అయితే కోటేశ్వర రావు మాత్రం ఏ అనుమానాలు చెప్పకపోవడం గమనార్హం.

కారులో ప్రయాణిస్తుండగా…ఏమిటి, మీరిద్దరు చాలా సీరియస్‌గా చర్చించుకుంటున్నారు. మీకు డిస్టర్బ్ ఎందుకని ఆ సమయంలో నేను అడగలేదంటూ తాను ఇంటికి వచ్చిన సమయంలో విజయ్, విరంచిల సంభాషణలను గుర్తు చేశారు.

ఓ అదా డాడీ, నా పిహెచ్‌డి థీసిస్‌కు ఎలాంటి సమాచారం సేకరించాలో, ఎక్కడెక్కడ లభిస్తుందో విజయ్ గారు వివరంగా చెబుతున్నారు. ఆయన చెబుతున్నదంతా నాకు కొంత కొత్తగా అనిపించిందంటే నాకు అనేక విషయాలు తెలియవని, పరిశోధన గ్రంథం అంటే ఏదో గైడ్ చెప్పిన పుస్తకాల నుంచి కొంత కాపీ కొట్టి, కొంత రాసి పూర్తి చేద్దామనే నాకు జ్ఞానోదయం అయింది నాన్నా. ఇక రేపటి నుంచి విజయ్ చెప్పిన సలహాలను అమలు చేయాల్సిందే. ఏమంటారు విజయ్ గారు.. ఈ విషయంలో మీతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తుంటాను. మీకు ఏమి ఇబ్బంది ఉండదు కదా అంటూ ప్రశ్నించింది.

అంటే… ఏవైనా రాజకీయ కార్యకలాపాల్లో ఉంటే తప్ప నాకు ఎలాంటి సమస్య ఉండదు. మీరు ఎక్కడికైనా వెళ్లి సమాచారం తీసుకోవాలంటే మీతోపాటు రావడానికి కూడా నాకు అభ్యంతరం లేదని విరంచి కళ్లలోకి చూశాడు విజయ్.

అంతకంటేనా… మీరు చెప్పినట్లుగా నగరంలోని మురికివాడల్లో దుర్బర జీవితం గడుపుతున్న ప్రజలను నేరుగా చూడాలనిపిస్తున్నది. మీకు ఎప్పుడు తీరిక ఉంటే అప్పుడు ముందుగా వెల్దాం విజయ్ గారు. మీరు వీలు చూసుకొని సమయం చెప్పండి నేను సిద్ధంగా ఉంటాను.

తప్పకుండా పోదాం. అయితే ఎంఎల్‌ఎ పర్యటన అంటూ పత్రికల వారు మర్నాడు వార్తలు ఇస్తారు. పక్కన మీ ఫోటో ఉంటే బాగుండదు. పబ్లిక్ ప్లేస్‌లకు మీ డ్రైవర్‌ను తీసుకుపొండి.కావాలంటే మా పిఎను తోడుగా పంపిస్తాను. మనస్సులో వెళ్లాలని ఉన్నా వాస్తవ పరిస్థితి తెలుసు కనుక కాదనక తప్పలేదు. పైగా అది తన నియోజక వర్గం కాదు. ఇక్కడికి ఎందుకు వచ్చినట్లు అని ఆ శాసనసభ్యుడు అనుమానిస్తాడు. మంత్రులు అయితే తమ రాష్ర్టంలో ఏ ప్రాంతం అయిన పర్యటించవచ్చు. మొదటిసారిగా అనిపించింది విజయ్‌కు. తాను మంత్రిని ఎందుకు కాలేదా అని.

బాగుంది.. మీరు వస్తే మరింత లోతుగా అధ్యయనం చేయవచ్చని, తెలియని విషయాలు అక్కడే తెలుసుకొని, ప్రభుత్వం చెబుతున్న అనేక సంక్షేమ కార్యక్రమాలు ఎందుకు వారికి చేరడం లేదో, అసలు ఏ పథకాలు ఉన్నాయి, ఎంత మంది లబ్ధిదారులకు అందుతున్నాయి, ఎక్కువ మంది కి ఎందుకు చేరడం లేదు, ఎవరు భాద్యులు, ఇతర అంశాలు మీరుంటే మరింతగా తెలుసుకునే వీలుంటుందని ఆశించాను.కానీ మీరు అన్నట్లుగా రాజకీయ నాయకులు కనిపిస్తే మీడియా వాళ్లు వెంటపడుతారు కరెక్టే. వద్దు లెండి, మీ పిఎను పంపించండి చాలు. అయితే ప్రభుత్వం దీనజనోద్ధరణకు చేపడుతున్న పథకాలు ఏమిటో నాకు ముందుగా చెప్పాలి మీరు, అని విరంచి కోరింది.

ఇవన్నీ పుస్తక రూపంలోనూ అందుబాటులో ఉంటాయి. ప్రభుత్వం ఏమి చేసినా, చేయకపోయినా పౌరసంబంధాల శాఖ ద్వారా ఏటేటా పుస్తకాలను ప్రచురించి మూలన పడేస్తుంది. జిల్లాలోని డిపిఆర్‌ఒల ఆఫీసులకు వాటిని పంపి, జిల్లా కేంద్రంలోని కార్యాలయాలన్నింటికి , అధికారులకు పంపుతారు. వాటిని ఎవరూ చదివిన పాపాన పోరు. అయితే వారు చేస్తున్న మంచి పని ఏమిటంటే అన్ని పత్రికలు, మీడియా సంస్థలకు వాటిని అందించడం. కనీసం విలేకర్లు అయినా చదువుతారంటే అది ఉండదు కానీ ఒక్కో మంత్రిత్వ శాఖగా ఉంటున్న ఈ పుస్తకాలను ఆయా శాఖలను చూసే రిపోర్టులు తమ వరకు తీసుకొని స్టోరీలు రాయడానికి ఈ సమాచారాన్ని వాడుకుంటారు. శాఖలో నిజంగా ఇంత జరుగుతున్నదా అని కొందరు పరిశోధిస్తారు కూడా.

ఇంత తతంగం ఉంటుందా? ప్రజాధనం అక్కడకూడా వృధా అవుతున్నదన్న మాట.

ప్రజాధనం వినియోగంలో ప్రతిపైసా వారికి ఏనాడు చేరదు. స్వర్గీయ ప్రధాని రాజీవ్ గాంధీ స్వయంగా ప్రకటించారు. ఢిల్లీ నుంచి వంద రూపాలయలు విడుదల అయితే ఆ నిధులు గ్రామాలకు చేరి, ప్రజలకు చేరేది 15 పైసలే అని. దీన్నిబట్టి చూడండి ఎంతగా అవినీతి, అక్రమాలకు ఈ ప్రభుత్వ కార్యక్రమాల్లో చోటుందో అంటూ నిట్టూర్చాడు విజయ్.

సరదాగా బయటకు వెళ్లి హోటల్‌లో భోజనం చేయాల్సి ఉండగా, ఇదేమి చర్చ మాకు ఏమి అర్థం కావడం లేదు. ఇంట్లో కూడా మీరు మాట్లాడుతుంటే ఒక్క ముక్క అర్థం కాలేదు. మీరు ఇద్దరు ఉన్నప్పుడు ఏమైనా మాట్లాడుకోండి కానీ నలుగురిలో వద్దు అమ్మాయి అంటూ తల్లి అనడంతో టాపిక్ మార్చక తప్పలేదు విజయ్‌కు.
సార్, మనం ెటల్‌కు వస్తున్నామని మన ఫ్రండ్‌కు మాటమాత్రంగా కూడా చెప్పకండి. ఆయన వచ్చి మన వద్ద కూర్చుంటే అంతా

రాజకీయ చర్చనే జరుగుతుంది. వీళ్లిద్దరికీ బోర్ కొట్టించిన వారం అవుతామని, కోటేశ్వర రావునుద్ధేశించిచెప్పాడు విజయ్. నేను మాత్రం ఎందుకు చెబుతాను. ముందుగా ఫోన్ చేద్దామని అనుకున్నాను కానీ మీరన్నారు కదా చేయను లెండి అన్నాడు కోటేశ్వర రావు. వారి మాటల్లోనే స్టార్ హోటల్ వచ్చింది.విరంచి పక్కనే కూర్చున్నందున జర్నీ రొమాంటిక్‌గా సాగుతుందని అనుకున్న విజయ్‌లో కొంత నిరాశ ఏర్పడినా… ఆమె తల్లిదండ్రులు కూడా ఉన్నందున అంతా మనమంచికే అనుకున్నాడు. అందురూ కారు దిగారు. అక్కడ ఉన్న డ్రైవర్ ఒకరు విజయ్‌కు, వాలెట్ పార్కింగ్ టోకెన్ ఇచ్చి కారును తీసుకువెళ్లాడు.

నలుగురు ెటల్ లోకి వెళ్లగానే ఢిన్నర్ హాల్‌కు దారి అనే బోర్డు చూసి ఆ హాల్‌లోకి ప్రవేశించారు. చాల రద్దీగా ఉంది. ఖాలీ సీట్లు పెద్దగా కనిపించలేదు. ఇదేమిటి మరో ెటల్‌కు వెల్దామా అని విరంచి ప్రశ్నించింది. వారి వద్దకు వచ్చి నిలుచున్న వెయిటర్‌కు తన వివరాలు చెప్పాడు విజయ్ .ముందుగానే కాల్ చేసి టేబుల్ బుక్ చేసుకోవడంతో నలుగురి కోసం రిజర్వు చేసుకున్న టేబుల్ వద్దకు తీసుకెళ్లాడు వెయిటర్.

కోటేశ్వరావుకు ఆ హోటల్ సుపరిచితమే అయినా, తన కుటుంబ సభ్యులను ఎప్పుడూ తీసుకురాలేదు. ఫ్రండ్స్ పార్టీలతోనే ఆయన సాయంత్రాలు అధికంగా గడుస్తుంటాయి. దూర ప్రయాణాలు చేసే సమయంలో మాత్రమే వారు ఎక్కువగా ెటల్ ఫుడ్ తీసుకుంటారు. విరంచి, ఆమె తల్లి కూడా ఇంటి భోజనమే బెస్టు అని ఎక్కువగా బయటికి రారు. విజయ్ ప్రతిపాదన కాదనడం బాగుండదని మాత్రమే వారు వచ్చారు.

ఏమి తీసుకుంటారని మెనూ కార్డు అందిస్తూ విరంచిని ప్రశ్నించిన విజయ్, సార్ మీకు నచ్చిన డ్రింక్ ఆర్డరివ్వండి ఆలస్యంగానే భోజనం చేద్దాం.అని కోటేశ్వర రావుకు చెప్పాడు విజయ్. వెయిటర్‌ను పిలిచి ఎవరికి ఏమీ కావాలో అర్డర్ ఇవ్వడంతో పాటు ముందుగా స్టార్టర్స్, చికెన్ సూప్ తెమ్మన్నారు. విరంచి,తాను పక్కపక్కనే కూర్చొని ఢిన్నర్ ను ఆస్వాదించడం కొత్త అనుభూతిగా మిగిలిపోతుందని విజయ్ తలపోసాడు. విరంచి కూడా అంతే, కావానే విజయ్ తమను ఈ డిన్నర్‌కు ఆహ్వానించినట్లుగా ఊహించింది. కారులో పక్కనే కూర్చోవడం ఇక్కడ కూడా నాన్న, అమ్మను కూర్చోబెట్టడం, మరో వైపు మేం ఇద్దరం…మొత్తానికి థ్రిల్లింగ్‌గా ఉంది. ఇంతకు విజయ్ మనస్సులో ఏముందో కానీ నాకు అతనిపై ప్రత్యేక అభిమానం కలుగుతున్నది. అయినా తొందరపడి ఏదీ ప్రస్తావించవద్దు. ముందుగా పిహెచ్‌డి పూర్తి కావాలి. నా లక్ష్యంలో వెనుతిరగరాదని తనకు తానే సర్దిచెప్పుకుంది విరంచి.

తనకిష్టమైనా జానీవాకర్(బ్లాక్‌లేబుల్) ఆర్డర్ చేస్తూ లార్జ్‌పెగ్ తెప్పించుకొని ఎంజాయి చేస్తున్నాడు కోటేశ్వర రావు. విజయ్ పరిచయం నిన్న మొన్నటిది కాకపోయినా…తన ఇంటికి రావడం, కుటుంబసభ్యుని మాదిరిగా కలసిపోవడం, ఇలా పరిచయం పెంపొందడం ఆయన ఊహించుకోలేదు. రాజకీయ నేతలతో ఆయనకు మంచి పరిచయాలే ఉన్నాయి. కాలేజీ అవసరాల కోసం డబ్బులిచ్చి వారితో పనులు చేయించుకోవడం ఆయనకు కొత్తకాదు. కానీ విజయ్ అందరిలాంటి వ్యక్తి కాదు. అవినీతి అంటే ఆమడదూరం. అందుకే ఆయన వల్ల తనకు రాజకీయంగా పెద్దగా ప్రయోజనం ఉండదు. కానీ మంచి మనిషి,ముఖ్యమంత్రికి సన్నిహితుడు. చూద్దాం ఏదైనా పెద్ద సమస్య వచ్చినప్పుడు సహాయపడకుండా ఉంటాడా అనుకుంటూ విజయ్‌నే గమనించాడు కోటేశ్వర రావు. విరంచి, విజయ్‌లు కబుర్లు చెప్పుకుంటూ సూప్ ఎంజాయి చేస్తూ, పిష్ ముక్కలు తింటున్నారు. భార్యను చూశాడు. ఆమె మొఖంలో ఆనందం. ఎప్పుడు ఇలా హోటల్‌కు రాలేదు కదా అందరినీ గమనిస్తున్నది. డ్రింక్ సిప్ చేస్తూనే.. ఆలస్యం అవుతుందేమో మెయిన్ కోర్స్ తెమ్మని చెబుదామా అన్నాడు కోటేశ్వర రావు. లేట్ ఏముందండి నగరంలో..ముంబయి నగరం అసలు నిద్రపోదట. మన దగ్గర కూడా రాత్రింబవలు వీటికి పర్మిషన్ ఇవ్వాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నది. అంటూ విజయ్ ఇప్పుడే వస్తానని డిన్నర్ హాల్ నుంచి బయటకు వచ్చాడు.

మొత్తం హోటల్ ఒక్కసారి చుట్టి రావాలని విజయ్ ఉద్ధేశ్యం. గడ్డం పెంచుకొని, కళ్లద్దాలుకూడా కొంత వెరయిటీగా పెట్టుకుంటున్నాడు ఈ మధ్య. పగలు అయితే నల్లటి కళ్లజోడు ధరిస్తున్నాడు. కొందరైనా తనను గుర్తు పట్టకుండా ఉంటే చాలని ఆయన ఇలా వ్యవహరిస్తున్నారు. గతంలో చూసిన వారు విజయ్‌ను వెంటనే గుర్తు పట్టలేనంతగా క్రమంగా వస్త్రధారణలోనూ మార్పులు చేసుకుంటున్నాడు. ఢిల్లీ ప్రమాదం ఆయనకు పదేపదే గుర్తుకు వస్తుండటమే ఇందుకు కారణం. అబ్బో హోటల్ చాలా పెద్దదే. అన్ని అంతస్తులు ఈ రోజు ఒక్కసారే చుట్టిరావడం అసాధ్యమని తేలిపోయింది. మరీ అలస్యం అయితే విరంచి వాళ్లకు ఏ సాకు చెప్పడానికి అవకాశం ఉండదనుకుంటూ కొంత వరకు వెళ్లి ఆగిపోయాడు విజయ్. కొందరు అబ్బాయిలు, అమ్మాయిలు, అందరూ ఏదో మత్తులో ఉన్నట్లుగా ఊగిపోతూ నడుస్తున్నారు. ఒకరిపై ఒకరు పడుతున్న ద్యాస కూడా వారిలో లేదు. వారి డ్రెస్‌లు చూస్తే ఎబ్బెట్టుగానే ఉన్నాయి. తాను ఊహించినట్లుగానే ెటల్‌లో ఏదో జరుగుతున్నది. పోలీసులకు తెలిసే జరుగుతున్నదా..అయినా మన వ్యవస్థలో మామూళ్లతో కళ్లు మూసుకోని పోలీసు ఉండడు, నాయకులు ఉండరు. ఈ మధ్య మీడియాను కూడా వ్యాపారులు మ్యానేజ్ చేస్తున్నారు. ఒక కవి చెప్పినట్లు నూటికో కోటికో ఒక్కడు మాత్రమే ఈ వ్యవస్థ మారాలని, ఏదో చేయాలని భావిస్తే అది అంత సులువు కాదు. తోటి మనుష్యులు కష్టపడుతుంటే చూడలేని వాడు ఒంరిగా ఏమి చేయలేని విధంగా పరిస్థితులున్నాయి. సమాజంలో ఎక్కువ మంది ఉన్న పరిస్థితులతో సర్దుబాటు చేసుకుంటూ కాలం వెల్లదీస్తున్నారు. కాదు కూడదని ఒకరిద్దరు ఏదైనా మంచి పనికి పూనుకున్నా వారిపై దాడులు జరుగుతున్నాయని మీడియాల్లో కథనాలు వస్తున్నాయి. ఇప్పటికేఆలస్యం అయింది అనుకుంటూ డైనింగ్ హాల్‌లోకి వచ్చాడు విజయ్.

తన సీటుకు పక్కనే మరో కుర్చీ వేయించుకొని కూర్చున్నదెవరా అనుకున్నాడు విజయ్‌కు, ఊ..అనుకున్నంత అయింది. హోటల్ యజమాని గారు అంటూ వచ్చి విష్ చేసి, పక్కనే కూర్చున్నాడు. ఎవరూ ఇతను, మీ అల్లుడు గారా? అమ్మాయి పెళ్లికి నన్ను పిలవనే లేదు అంటూ క్వశ్చన్ మార్కు పెట్టాడు భుజంగారావు. అదేమిటి విజయ్ గారిని మర్చిపోయారా అంటూ గడ్డం పెంచాడుకదా గుర్తుపట్టలేదా అన్నాడు కుటుంబరావు. నా కూతురు పెళ్లిచేస్తే మీకు చెప్పకుండా ఉంటానా అంటూ ఎదురు ప్రశ్నించాడు.

ఏమిటి విజయ్ గారు, మీరు వస్తున్నట్లుగా ముందుగా చెబితే స్పెషల్‌గా అరెంజ్ చేయించే వాన్ని కదా అంటూ భుజంగ రావు కొంత నొచ్చుకుంటూ మాట్లాడారు.

(సశేషం)


త‌ప్ప‌క‌చ‌ద‌వండి: విజయుడు (ధారావాహిక న‌వ‌ల‌ పార్ట్‌-22)

Leave A Reply

Your email address will not be published.