విజయుడు (ధారావాహిక నవల పార్ట్-12)
అంతవేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో అంతే వేగంగా కిందపడిన నేను, ఎట్టి పరిస్థితుల్లోనూ బతకడానికి వీలు లేదు. ఏ దేవుడో ఆదుకొని బతికించి ఉంటాడని అప్రయత్నంగా విజయ్ శూన్యంలోకిచేతులు జోడించాడు. అప్పటివరకు తన గదిలో ఒక్క దేవుని విగ్రహం కూడా లేని విషయం అప్పుడే గుర్తుకు వచ్చింది. వెంటనే డ్రస్సప్ అయి బజారుకు వెళ్లి… పాల సముద్రంలో శేషశయ్యపై పవలించిన మహావిష్ణువు, ఆయన హృదయంలో ఉన్న మహాలక్ష్మిదేవి ఉన్న చిత్రపటాన్ని కొనుగోలు చేసి గదికి తెచ్చుకున్నారు. తన క్వార్టర్‌లో ఉన్న పూజ గదిని ఇప్పటివరకు వినియోగించుకోలేదు. కానీ ఈ రోజు గది అంతా తానే స్వయంగా శుభ్రం చేసుకున్నారు. బజార్ నుంచి పూలమాల, దీపం వెలిగించడానికి అవసరమైనా సామాగ్రిని కూడా తెచ్చుకోవడం మంచిపని అయిందని విజయ్ భావించాడు. శుద్దిగా స్నానంచేసి శుచి అయి పూజ కార్యక్రమాలు పూర్తి చేసి ప్రార్థన చేస్తూ కూర్చున్నాడు.
అలా ఎంత సేపు కూర్చున్నాడో కాని కర్తవ్యం గుర్తుకు వచ్చిన వాడిలా ఉలిక్కిపడి లేచాడు. సెల్‌ఫోన్ నెంబర్ జ్ఞపికి ఉండటంతో కొత్త సిమ్ తీసుకోవడంతోపాటు ఫోన్ కూడా అప్పడికే కొన్నాడు. వెంటనే మదిలో కుటుంబరావు మొదలడంతో కాల్ చేసి ఈవినింగ్ మీ ఇంటికి వచ్చి కలుస్తాను, ప్రీగా ఉన్నారా అని ప్రశ్నించడంతో ఉంటాను రండీ, అని ఆయన ఆహ్వానించారు. సాయంత్రం కావస్తుండటంతో కారును స్వయంగా నడుపుకుంటూ కాలేజీల యాజమాన్య సంఘం అధ్యక్షుడు కుటుంబరావు ఇంటికి బయలు దేరారు. గతంలో ఒకసారి అమీర్‌పేట వెళ్లినప్పుడు తన ఇల్లు ఇక్కడే అంటూ ఒక రోడ్డును చూపి ఆనవాలు కూడా కుటుంబరావు చెప్పినట్లుగా గుర్తు ఉంది విజయ్‌కు. ఎంఎల్‌ఎ క్వార్టర్స్ నుంచి తిన్నగా అమీర్‌పేటకు బయలు దేరిన విజయ్, సులువుగానే ఆయన ఇళ్లు కనుగొన్నారు. తన కారు ఇళ్లు సమీపిస్తుండగానే వాచ్‌మెన్ గేటును ఓపెన్ చేయడంతో లోనికే కారు తీసుకువెళ్లి కారు ఆపారు. కారు లాక్ చేసి ఇంటి గుమ్మం తలుపులు తెరిచే ఉన్నప్పటికీ మర్యాద కోసం కాలింగ్ బెల్ నొక్కి బయటే నిలబడ్డాడు. బెల్ చప్పుడు వినగానే ఎదురుగా వస్తున్న అమ్మాయిని అదే పనిగా కళ్లార్పకుండా చూస్తూ తనలో తానే మాట్లాడుకున్నాడు. ఇదేమీ దేవలోకంలో ఉండాల్సిన అపూర్వ సౌందర్యం ఇక్కడ దర్శనమిస్తున్నది. దేవేంద్రుని సభలో నా కళ్లకు సాక్షాత్కరించిన ఆ సౌందర్యరాసులకు మించిన అందం..ఓె.. ఈమె అందం ఎక్కడ ఉంది. కన్నులలోనా. నంది తిమ్మన్న వర్ణించినట్లుగా ముక్కు లోనా… కెంపులుగా మెరుస్తున్న ఆ చెక్కిళ్లలోనా.. మేఘాలను బోలు కురులలోనా.. మొఖంలోని ప్రతి చోటు ఈమె అందాన్ని ద్విగుణీకృతం చేస్తున్నది..ఏమీ ఈ లలనామణి రూప లావణ్యం, బ్రహ్మదేవుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని తీర్చిదిద్దినట్లుగా ఉంది. కనుల ముందు ఉన్న ఈ అందాల రాసి విజయ్‌కు కనువిందు చేస్తున్నది.
అప్సరసాంగన కాబోలు. దివి నుంచి భువికి దిగివచ్చినట్లుగా ఉంది.అష్టవిధ కన్యకలను వర్ణించిన ప్రబంధకవులు బహుశ ఈమెను చూసి ఉంటే తమ నాయికలు, ఈమె అందం ముందు దిగదిడుపే అని అనుకునే వారేమో.. కలగంటున్నానా..లేక నిజంగానే ఆమెను చూస్తున్నానా అనే తన్మయత్నంలో విజయ్ ఉండగా… ఏమండీ నిలబడే పలువరిస్తున్నారు..విజయ్ గారేనా… నాన్న ఫోన్ చేసి చెప్పారు.. కాలేజీ నుంచి తాను బయలుదేరుతున్నానని… మీరు రండి… ఆహ్వానించింది. ఆ యువతి తియ్యని కంఠంతో చెబుతున్న మాటలను వింటూ విజయ్ మైకం నుంచి బయటకు వచ్చాడు.
సభ్యత కాదని వెంటనే సారీ అంటూ ఆమెతో మాటలు కలిపాడు.
పర్వాలేదు లెండి కవిత్వం బాగానే ఒంటబట్టినట్లు ఉంది. అని ఆమ్మాయి చురక అంటించింది.
అదికాదండీ అంటూ విజయ్ ఏదో చెప్పబోయే లోగా.. మీరు మనుసులో అనుకున్నదంతా బయటికే వినిపించింది. ఏ మాత్రం పరిచయం లేని ఒక యువతిని చూసి మరీ అలా మాట్లాడితే ఎలాగండి. మీరు ఎవరో నాకు తెలుసు కాబట్టి నేను తప్పుగా భావించలేదు. నాన్న చెబుతుంటారు మీ మంచితనం, ప్రజల పట్ల మీకున్న నిబద్ధత గురించి తరుచూ సంభాషిస్తారు. పైగా అసెంబ్లీ సమావేశాల సమయంలో నేను కూడా ప్రత్యక్ష ప్రసారం చూడటంతో పరోక్షంగా మీరు నాకు తెలుసంటూ ముగ్ద మనోహరంగా ఆమె చెబుతుంటే విజయ్ మైమర్చిపోయి వింటున్నాడు. ఏమండీ కాఫీ తీసుకుంటారా అని అడగడంతో.. ఆ ఆ అంటూ తలూపాడే కాని ఆమె నుంచి కన్నులు తిప్పుకోలేక పోతున్నాడు.
కాఫీ కోసం ఆమె వంటగదిలోకి వెళ్తున్నంతసేపు అటే చూస్తూ ఉన్నాడు. అంతలో ఇదేమిటి మర్యాద లేకుండా ప్రవర్తిస్తున్నాను నేను.. సభ్యత మరిచి పరాయి స్త్రీ పట్ల అలా వ్యవహరించడం తగదని తనకు తానే సర్ధిచెప్పుకున్నాడు.
కాఫీ కప్పుతో విజయ్ దగ్గరకు వచ్చిన ఆ పడుచు… ఏమిటీ మీరు దేవేంద్రుని సభలో రంభాది అప్సరసలను చూశారా? అలా పోలిక తెచ్చి మాట్లాడుతుంటే నాకు మరీ ఆశ్చర్యం వేసిందంటే నమ్మండి .. లేక సాహిత్యం ఔపోసనా పడుతుంటారా?భారత, ఇతిహాసాలు, ప్రబంధ కావ్యాలు ఎక్కువగా చదువుతారా? అయినా మీరు రాజకీయ నాయకులు కదా అంత తీరిక ఎక్కడ ఉంటుంది. అమ్మో నా ముఖ సౌందర్యం వరేక ఆగిపోయారు. ఇంకా ఏమేమి మాట్లాడేవారో నేను అంతరాయం కలిగించకుంటే అంటూ మాటలతోనే మరింత ఉడికించింది.
లేదండి.. ఎందుకో మిమ్ములను చూడగానే అలా అనిపించింది. తప్పుగా అనుకోకండి.. అంటూ అభ్యర్థనగా చూశాడు విజయ్.
సరే లెండి.. మీకు అలా అనిపించింది అన్నారు. మీరు మాత్రం ఏమి తక్కువ..సినిమా హీరోలు, నవలా నాయకులు, ప్రబంధ కవుల కథానాయకులకు తీసిపోనట్లుగా చాలా అందంగానే కనిపిస్తున్నారంటూ కాప్లిమెంట్ ఇవ్వడంతో విజయ్‌కు కొంత బిడియం అనిపించింది. తాను ఆమె అందచందాలను ప్రస్తావిస్తే అదే స్థాయిలో తనగురించి కామెంట్ చేసిన పడచువైపు అదోలా చూసి వెంటనే చూపు మరల్చు కున్నాడు విజయ్.. ఫ్రండ్స్ అంటూ విజయ్ చేయి చాపడంతో ఓకే అన్నట్లుగా ఆమె కూడా షేక్ హ్యాండ్ ఇచ్చింది. ఈ సమయంలోనే కుటుంబరావు ఇంట్లోకి ప్రవేశిస్తూ…కొద్దిగా ఆలస్యం అయింది బోర్ కొట్టలేదుగా విజయ్‌గారు అంటూ పలకరించాడు. లేదండి మీ అమ్మాయి కాఫీ ఇచ్చి కొన్ని మాటలు కూడా మాట్లాడారు. సమయం ఇట్టే గడిచిపోయింది.
తండ్రి రాగానే మీకు కాఫీ తెస్తాను డాడీ… ఏమండి విజయ్‌గారు మరో కాఫీ తాగుతారా అంటూ ప్రశ్నించింది. తప్పకుండా బ్రహ్మచారులం కదా..ఎప్పుడు ెటల్స్‌లో తాగడమే ఇలా ఇంటిలో ఆతిధ్యం, కాఫీ రుచి బాగుంది. ముఖ్యమంత్రి గారి ఇంట్లో కూడా అన్నపూర్ణమ్మ గారు ఎప్పుడు వెళ్లినా ఏదో ఒకటి తినమని బలవంతం చేసి తినిపిస్తుంది. స్వంత కొడుకు మాదిరిగా నన్ను చేరదీస్తుంది ఆమె, అన్నాడు విజయ్.
అవును ఆమె మనస్సు వెన్న. పాపం వారికి సంతానం లేకపోవడం పెద్దలోటే.. ముఖ్యమంత్రి జానకి రామయ్య గారు రాజకీయంగా మంచి దశలో ఉన్నప్పటికీ కుటుంబపరంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు. పార్టీ అధిష్ఠాన వర్గంలోనూ ఆయనకు మంచి పేరుందని అంటారు. రాష్ట్రానికి సంబంధించి ఆయన ఎంతచెబితే అంతా అని అనుకుంటారు. అందుకే అసమ్మతివాదులు ఏమాత్రం బయటపడటం లేదు. సిఎం గారు కూడా అందరిని కలుపుకొని పోవడానికే ప్రయత్నిస్తున్నారు. అయ్యో ఇది మీకు తెలియని విషయమా అంటూ తనకు తెలిసిన రాజకీయం మాట్లాడాడు కుటుంబరావు. మూడు కప్పుల కాఫీతో విరంచి వారు కూర్చున్న హాల్‌కు వచ్చి వారిద్దరి కాఫీలిచ్చి, తనో కప్పు తీసుకొని కూర్చుండి పోయింది.
మా అమ్మాయి విరంచి.. పోస్టు గ్రాడ్యువేషన్ అయిపోయి, ఎంఫిల్ కూడా పూర్తి చేసి ప్రస్తుతం పిహెచ్‌డి చేస్తున్నది. అంటూ విజయ్‌కు పరిచయం చేశాడు కుటుంబరావు….ఓె అలాగా అంటూ చిరునవ్వుతో ఆమెవైపు చూసాడు విజయ్.
పెళ్లి చేయాలని వాళ్ల అమ్మ పట్టుబడుతున్నా విరంచి వినడం లేదు. పిహెచ్‌డి పూర్తి చేయాలి. తర్వాత యూనివర్సిటీలో టీచింగ్ విభాగంలో చేరిన తర్వాతనే పెళ్లి అంటూ ఆమె వాయిదా వేస్తున్నదని చెబుతూ ఈ కాలం ప్లిలు తమ ఇష్టానుసారమే నిర్ణయం తీసుకుంటున్నారు. కాదంటే మా పెద్దరికమే ప్రమాదంలో పడుతుందంటూ నవ్వు తెచ్చుకున్నాడు.
ఏమి మాటలు నాన్న అంటూ కాఫీ కప్పులు తీసుకొని విరంచి లోపలికి వెళ్లిపోయింది.
ఊ చెప్పండి చానాళ్ల తర్వాత కలుసుకున్నాం కదా మనం..ఈ ఏడాది ప్రారంభ వేడుకలంటూ మనం ెటల్‌లో కలిసి ఢిన్నర్ చేశాం. డిసెంబర్ 31 రాత్రి కదూ… అందిరూ డ్రింక్స్ తీసుకుంటున్నారు. అయితే మీకు ఆలస్యం అవుతురదని ముందుగానే భోజనం చేసి వెళ్లినట్లున్నారు.
అవునండి ఇతరులు డ్రిక్స్ తీసుకుంటూ ఎంజాయి చేస్తుంటే ఎదురుగా ఎక్కువ సేపు కూర్చోవడం నాకు సుతరాం నచ్చదు. డ్రిక్స్ తీసుకోని వారికి ఇదో పనిషిమెంట్. అయినా మీరు నన్ను బలవంతంగా కూర్చోమన్నా…లేదని భోజనం చేసి బయటకు వచ్చాను. ఆ రోజు ఏమైనా విశేషమా?
విజయ్ ఈ మాట అనగానే ఒక్కసారిగా కోటేశ్వర రావు ముఖంలో రంగులు మారాయి. ఒక్కసారిగా ఆందోళనలో పడిపోయినట్లుగా విజయ్ గమనించక పోలేదు.
ఏమీ లేదు. అర్థ రాత్రి వరకు అక్కడ ఉండి, నూతన సంవత్సర శుభాకాంక్షలు ఒకరికొకరు చెప్పుకొని ఎవరింటికి వారు వెళ్లిపోయారు. అంతే జరిగింది.. ఇంకా ముఖ్య విషయం ఏమీలేదు.. ఏమీ లేదు.. అంటూ కొంత సందేహంగానే సమాధానం ఇచ్చారు…
పర్వా లేదు లెండి. నేను మామూలుగానే అడిగాను.
ఆ…ఆ.. మీరు ప్రత్యేకంగా నన్ను కలిసేందుకు వచ్చారు… ఏమిటీ సంగతులు అంటూ మాట మార్చే ప్రయత్నం చేశారు కుటుంబరావు.
ఎందుకో మిమ్ములను కలవాలని అనిపించింది. ఆనాడు మీ మాటలను బట్టి మీరు ఆత్మీయులుగా తోచారు. అందుకే మిమ్ములను కలవాలని వచ్చాను. అంతే.. మీకు అభ్యంతరం లేకపోతే అప్పుడప్పుడు మీ ఇంటికి వస్తుంటాను. మీకు ఫోన్ చేసి వస్తాను ..మీ సమయానుసారమే సుమా… సెలవా మరీ..
నిరభ్యంతరంగా ఎప్పుడైనా రావచ్చు.. అమ్మాయి ..విజయ్ వెళ్లుతున్నాడు అంటూ పిలవడంతో విరంచి హాల్ లోకి వచ్చింది.
విజయ్ కిందికి వచ్చి కారు వద్దకు వస్తుండగా తండ్రీ కూతులిద్దరు సాగనంపారు. కారు స్టార్ట్ చేస్తుండగా టాటా అంటూ చేతులు ఊపి విరంచి ఆత్మీయంగా చూసిన చూపులు విజయ్ గమనించాడు.
కారు వెళ్లిపోగానే విజయ్ సరదా మనిషిలాగే ఉన్నాడు నాన్నా. మీరు వచ్చే ముందు కొద్దిసేపు మాట్లాడుకున్నాం. రాజకీయాలతోపాటు సాహిత్యంపై కూడా ఆయనకు అభిరుచి ఉన్నట్లుగా ఉంది. అంది విరంచి
అవునమ్మా… మంచి వాళ్లకు మన సమాజంలో శత్రువులు కూడా ఉంటారు. ముక్కు సూటిగా వెళ్లే ఆయన మనస్తత్వం కూడా కష్టాలు కొని తెచ్చిపెడుతుంది కొందరికి. విజయ్ అంతా తన వాళ్లే అనుకుంటారు. ఏ విషయమైనా నిర్భయంగా మాట్లాడుతారు. ఇది అన్ని వేళల మంచిది కాదు తల్లీ… శాసనసభ్యునిగా ఎన్నికైన తర్వాత కూడా ఆయన దూకుడు ఆగలేదు. ప్రజల పట్ల నిబద్ధతగల మనిషి. కానీ ఇది ఎందరికో ఆగ్రహం కలిగిస్తున్నది. ఇది ఆయనకు తెలియడం లేదు. ఎవరూ చెప్పలేరు కూడా .పైగా ఈ దూకుడంటేనే ముఖ్యమంత్రికి ఇష్టమని అందుకే సిఎం, విజయ్‌ను అభిమానిస్తున్నాడని అంటుంటారు.
ఏమి చెబుతున్నారు డాడీ…అంత మంచివాడికి శత్రువులుంటారా? ఎవరికి చెడు తలపెట్టే మనస్తత్వం ఉన్నట్లుగా లేని వ్యక్తిత్వం ఉన్న వాడుగా కనిపిస్తున్నాడు నాన్నా. నిజంగా అంత ప్రమాదంలో ఉన్నాడా విజయ్ అంటూ కొంత ఆందోళనగా ప్రశ్నించింది విరంచి.
లేదమ్మా ఇప్పుడేమీ ప్రమాదం లేదు. కానీ ఆయన అసెంబ్లీలో చేసే ప్రసంగాలు, తరుచుగా మీడియాలో చెప్పే విషయాలు వ్యాపారులకు కంటగింపుగా ఉంటున్నాయి. తర్వాత వారి వ్యాపారాలపై దాడులు జరుగుతున్నాయి. పన్నులు చెల్లించడం లేదనో బ్లాక్ మార్కెట్ అనో అవినీతి, అక్రమాలంటూ విజయ్ బయటపెడుతున్న విషయాలు ప్రజల దృష్టిలో ఆయన హీరో అవుతున్నా, నష్టపోతున్న వారు శత్రువులుగా మారుతున్నారు. సమాజాన్ని ఒక్కడే ఉద్దరించలేడుగా తల్లీ.. చూద్దాం ఆయన భవిష్యత్తు ఎలా ఉంటుందో అంటూ సంభాషణ ముగించి కాలేజీ వ్యవహారంపై తన సిబ్బందికి ఫోన్ చేయడానికి సెల్‌ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు.
తండ్రి, ఈ విధంగా విజయ్ గురించి చెప్పడం విరంచిని ఆందోళనకు గురిచేసింది.. అయ్యో పాపం ఆపదలో చిక్కుకుంటున్నాడా విజయ్. చిన్న వయస్సులోనే, రాష్ట్ర రాజకీయాల్లో మంచి పేరును గడిస్తున్న విజయ్‌కు ఇబ్బంది రాకూడదు. కుళ్లిపోయిన సమాజాన్ని చూస్తూ ప్రేక్షక పాత్రలో ఉండటం బహుశ విజయ్ లాంటి వారికి సహించదు. ఎందుకైనా మంచిది కొంత జాగ్రత్తలో ఉండమని చెప్పాలి. అనుకుంటూ విరంచి తన తండ్రి సెల్‌ఫోన్ తీసుకొని విజయ్ నెంబర్‌ను తన ఫోన్‌లో ఫీడ్ చేసుకుంది. రేపు ఉదయమే విజయ్‌తో మాట్లాడాలని నిర్ణయించుకుంది. పిహెచ్‌డి సిద్ధాంత వ్యాసం రాసేందుకు అవసరంగా తాను లైబ్రరీ నుంచి తెచ్చుకున్న రెఫరెన్స్ పుస్తకాలనుంచి ఒకదానిని చేతిలోకి తీసుకుంది.
శాసనసభ్యుల గృహ సముదాయానికి తిరిగి వచ్చిన విజయ్‌కు మనస్సు మనస్సులో లేదు. విరంచి పరిచయం కొంత ఉపశమనంగా ఉన్నప్పటికీ కుటుంబరావు మాటలే మరీమరీ గుర్తుకు వస్తున్నాయి. ఆయన నా నుంచి ఏదో దాస్తున్నారు. డిసెంబర్ 31 వ తేదీ ఏదో జరిగింది. ఏమై ఉంటుంది. అక్కడికి వచ్చిన వారందరూ సమాజంలో గౌరవనీయులే. అయితే ఆయా రంగాల్లో కీలక వ్యక్తులు కూడా…వారికి నా అలవాట్లు తెలుసు. తాను లిక్కర్ తీసుకోలేదు కానీ కూల్ డ్రింక్ తాగుతూ కొంత సమయం తర్వాతనే వారి అనుమతి తీసుకొని వచ్చాను. తర్వాత ఏమి జరిగి ఉంటుంది.
పరిపరి విధాలుగా ఆలోచించాడు విజయ్. ఏదో జరగకూడనిది జరిగింది లేకుంటే కుటుంబరావు అంతగా ఈ విషయాన్ని గుర్తు చేయడు. ఢిల్లీలో నాపై జరిగిన హత్యా ప్రయత్నం ఇందులో భాగం కాదు కదా ..నో నో వారిలో ఎవరికీ నేను కనీస అపకారం చేయలేదు. నాకు వారు శత్రువులా..ఎందుకు? ఎందుకు? వారిలో ఉన్నవారు కాకపోతే, కారకులు ఎవరో..తన హత్య జరిగింది వాస్తవమే కదా… మరి చంపిందో, చంపించింది ఎవరో???
(సశేషం)
Wow, incredible blog format! How lengthy have you been running a blog for? you made blogging look easy. The entire glance of your web site is excellent, let alone the content!!