డిసెంబర్ 6 నుండి 17 వరకు వన్‌ప్లస్ కమ్యూనిటి సేల్
వన్‌ప్లస్ 12, 12ఆర్, నార్డ్4 వంటి స్మార్ట్ ఫోన్లు భారీ డిస్కౌంట్స్‌కు అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం. ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వన్‌ప్లస్ కమ్యూనిటి సేల్‌ను ప్రకటించింది. స్మార్ట్ ఫోన్లపై భారీ ఎత్తున డిస్కౌంట్స్ ప్రకటించింది. దీంతో పాటు బ్యాంక్ డిస్కౌంట్‌లను అందిస్తోంది. అంతేకాకుండా 12 నెలల వరకు నో-కాస్ట్ ఇఎంఐ సదుపాయాన్ని కూడా కల్పిస్తోంది.
వన్‌ప్లస్12పై రూ.6వేలు డిస్కౌంట్‌తో పాటు ఐసిఐసిఐ బ్యాంక్ , వన్‌కార్డ్, ఆర్బిఎల్ బ్యాంకు క్రెడిట్ కార్డు యూజర్లు రూ.7వేలు డిస్కౌంట్ పొందవచ్చు. 12జిబి ర్యామ్, 256 జిబి స్టోరేజి వేరియంట్‌తో ఉన్న ఈ మొబైల్ ధర రూ. 64,999 .ఈ ఫోన్‌పై రూ.6వేలు డిస్కౌంట్ , బ్యాంకు కార్డులపై రూ.3వేలు డిస్కౌంట్ ఇస్తామని ప్రకటించింది. నార్డ్4 స్మార్ట్ ఫోన్‌పై కూడా రూ.3 వేలు డిస్కౌంట్, రూ.2వేలు బ్యాంక్ డిస్కౌంట్ సేల్‌లో లభిస్తుంది.
అదేవిధంగా వన్‌ప్లస్ నార్డ్ సిఇ4, నార్డ్ సిఇ4 లైట్‌పై రూ.2 వేలు డిస్కౌంట్, రూ.వెయ్యి బ్యాంక్ డిస్కౌంట్ ఇస్తున్నారు. అంతేకాక, వన్‌ప్లస్ ప్యాడ్ గో, వన్‌ప్లస్ వాచ్2, వన్ ప్లస్ వాచ్ 2 ఆర్, వన్‌ప్లస్ బడ్స్ ప్రో 3 పైనా కూడా ఆఫర్లు ఉన్నాయి. పూర్తి వివరాలకు వన్‌ప్లస్ వెబ్‌సైట్నుచూడగలరు