నారాయణపూర్-బీజాపూర్ సరిహద్దులో భారీ ఎన్‌కౌంటర్.. ఏడుగురు మావోయిస్టులు మృతి

బీజాపూర్ (CLiC2NEWS): ఇటీవల కొన్ని నెలల నుండి మావోయిస్టులకు భద్రతా దళాలకు మధ్య జరుగుతున్న కాల్పుల్లో మవోయిస్టులు అధిక సంఖ్యలో మృతి చెందారు. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్- బీజాపూర్ సరిహద్దులో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఉదయం 11 గంటల నుండి కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. పోలీసులకు అందిన సమాచారం మేరకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది, స్థానిక పోలీసులతో కలిసి గురువారం కూంబింగ్ చేపట్టారు.