గ్యాస్ లీక్ కావడంతో భారీ అగ్ని ప్రమాదం.. 31 మంది మృతి

బీజింగ్ (CLiC2NEWS): చైనాలోని యించువాన్ నగరంలోని ఓ రెస్టారెంట్‌లో గ్యాస్ లీకయ్యి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 31 మంది మృతి చెందినట్లు సమాచారం. చైనా ప్రజలందరూ డ్రాగన్ బోట్ ఫెస్టివల్‌ను జరుపుకుంటున్నారు. వరుసగా మూడు రోజులు సెలవు దినాలు కావడంతో కుటుంబంతో కలిసి అందరూ సంతోషంగా గడుపుతున్నారు. బుధవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో ప్యూయాంగ్ బార్యెక్యూ రెస్టారెంట్‌లో గ్యాస్ లీక్ కావడంతో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో సుమారు 31 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో ఫైరింజన్‌లు ఘటనా స్థలంలో మంటలు ఆర్పివేశాయి.