HYD: కొన‌సాగుతున్న అతిపెద్ద వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌.. భారీగా రద్దీ

హైదరాబాద్‌ (CLiC2NEWS): హైద‌రాబాద్ నగరంలో నిర్వ‌హిస్తున్న అతిపెద్ద కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ డ్రైవ్ కొన‌సాగుతోంది. హైటెక్స్‌లో ఏర్పాటు చేసిన మొత్తం 30 హాళ్ల‌లోని 300 టేబుళ్ల వ‌ద్ద క‌రోనా టీకాలు వేస్తున్నారు. ప్రారంభ‌మైన మొద‌టి గంట‌లోనే 5 వేల మంది వ్యాక్సిన్ తీసుకున్న‌ట్లు అధికారుతు తెలిపారు. హైటెక్‌ ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో మెగా కొవిడ్‌ టీకా కార్యక్రమం ఉదయం ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం, సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో మెడికవర్‌ దవాఖానలు ఈ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నాయి. సాయంత్రం 6 గంటల వరకు వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ కొనసాగనుంది.

ఒకేచోట 40 వేల మందికి వ్యాక్సిన్‌ వేయాలనే లక్ష్యంతో నిర్వ‌హిస్తున్న డ్రైవ్ దేశంలోనే మొద‌టి కావ‌డం గ‌మ‌నార్హం వ్యాక్సిన్‌ కోసం జనాలు భారీగా తరలిరావడంతో ట్రాఫిక్‌ స్తంభించింది. రద్దీ నియంత్రణకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఉద‌యం 8 గంట‌ల నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు ఈ డ్రైవ్ కొన‌సాగ‌నుంది.

మాదాపూర్ హైటెక్స్‌లో న‌డుస్తున్న మెగా వ్యాక్సినేష‌న్ డ్రైవ్‌కు ప్ర‌జ‌లు, ఉద్యోగులు భారీగా త‌ర‌లి రావ‌డంతో ట్రాఫిక్ జామ్ అయింది. ఇక్క‌డ మాదాపూర్ హైటెక్స్ సిటీ కూడ‌లి నుండి హైటెక్స్ వ‌ర‌కూ 3 కిలో మీట‌ర్ల మేర వాహ‌న రాక‌పోక‌లు నిలిచిపోయాయి.

Leave A Reply

Your email address will not be published.