Hyd: ఖైర‌తాబాద్‌లో క‌దులుతున్న కారులో మంట‌లు

హైద‌రాబాద్ (CLiC2NEWS): న‌గ‌రంలోని ఖైర‌తాబాద్ జంక్ష‌న్‌లో పోలీసు ఎస్కార్ట్ వాహ‌నం ద‌గ్ధ‌మైంది. షార్ట్ స‌ర్క్యూట్‌తో వాహ‌నంలో పెద్ద ఎత్తున మంటలు చెల‌రేగాయి. కారులో ఉన్న సిబ్బంది వెంట‌నే మంట‌ల‌ను గ‌మ‌నించి కిందికి దిగ‌డంతో ప్రాణాప్రాయం త‌ప్పింది. ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న అగ్నిమాప‌క సిబ్బంది మంట‌ల‌ను అదుపు చేసింది. కారు ఇంజిన్‌లో విద్యుత్ షాక్ వ‌ల్లే ప్ర‌మాదం జ‌రిగి ఉంటుంద‌ని పంజాగుట్ట పోలీసులు ప్రాథ‌మికంగా నిర్ధారించారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఉద్యోగులు ఆఫీసుల‌కు వెళ్లే స‌మ‌యం కావ‌డంతో కొద్ది సేపు ఖైరతాబాద్ ప్రాంతంలో ట్రాఫిక్ స్తంభించింది. అనంత‌రం పోలీసులు ట్రాఫిక్‌ను క్ర‌మ‌బ‌ద్ధీక‌రించారు.

Leave A Reply

Your email address will not be published.