క్వాలిఫ‌య‌ర్‌-2లో హైద‌రాబాద్ బ్యాటింగ్ ముగిసింది.

చెన్నై (CLiC2NEWS): హైద‌రాబాద్ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 175 ప‌రుగులు చేసింది. చెన్నైవేదిక‌గా జ‌రుగుతున్న ప్లే ఆఫ్స్ క్వాలిఫ‌య‌ర్ -2 మ్యాచ్‌లో టాస్ ఓడి హైద‌రాబాద్ ముందుగా బ్యాటింగ్ కు దిగింది. అభిషేక్ శ‌ర్మ‌, ట్రావిస్ హెడ్ ఓపెన‌ర్లుగా వ‌చ్చారు. మొద‌టి ఓవ‌ర్‌లోనే అభిషేక్ శ‌ర్మ ఔట‌య్యాడు. 37 ప‌రుగులు చేసిన త్రిపాఠి 5 ఓవ‌ర్లో చాహ‌ల్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఐదో ఓవ‌ర్ చివ‌రి బంతికి మార్‌క్ర‌మ్ ఔట‌య్యాడు. దీంతో ఐదు ఓవ‌ర్ల‌లో హైద‌రాబాద్ మూడు వికెట్లు న‌ష్ట‌పోయి 57 ప‌రుగులు చేసింది. క్లాసెస్ అర్ధ శ‌త‌కంతో రాణించాడు. హెడ్ 34 ప‌రుగులు చేసి 10 వ ఓవ‌ర్లో అశ్విన్‌కు క్యాచ్ ఇచ్చాడు.

Leave A Reply

Your email address will not be published.