కారు డ్రైవర్ నిర్లక్ష్యంతో.. రెండేళ్ల చిన్నారి మృతి
![](https://clic2news.com/wp-content/uploads/2021/01/dead-body.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలోని ఎల్‌బినగర్‌లో కారు డోర్ తగిలి ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. సయ్యద్ కుంటుంబం ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్నారు. నగరంలోని ఎల్‌బినగర్ సమీపంలో కారు డోర్ తగిలి రెండేళ్ల చిన్నారి మృతి చెందింది. కారు డ్రైవర్ నిర్లక్ష్యంగా డోర్ తీయడంతో బైక్‌పై వెళ్తున్న ముగ్గురు కిందపడిపోయారు. రెండేళ్ల చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ పరారీలో ఉన్నట్లు సమాచారం. చిన్నారి తల్లిదండ్రులు స్వల్పగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.