హైదరాబాద్ నగర ప్రజలకు శుభవార్త.. కొత్తగా 40 ఎంఎంటిఎస్ రైలు సర్వీసులు
సికింద్రాబాద్ (CLiC2NEWS): జిహెచ్ ఎంసి పరిధిలో 40 ఎంఎంటిఎస్ రైలు సర్వీసులను పెంచనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. రైళ్ల పెంపుతో పాటు వాటి గమ్య స్థానాలను సైతం పొగిడించింది. సికింద్రాబాద్-మేడ్చల్ మధ్య కొత్తగా 20 ఎంఎంటిఎస్ సర్వీసులు, ఫలక్‌నుమా-ఉందానగర్ మధ్య మరో 20 రైళ్ల గమ్మస్థానాలను గమ్మస్థానాలను పొడిగించింది. ఈ రైళ్ళ సర్వీసులతో కలిపి హైదరాబాద్-సికింద్రాబాద్ జంటనగరాల్లో ఎంఎంటిఎస్ సర్వీసులు మొత్తం 106 కి చేరినవి.