రూ.10వేల కోట్లతో ఎఐ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు కుదిరిన ఒప్పందం

హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలో ఎఐ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జపాన్ పారిశ్రామిక వేత్తలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. జపాన్ పర్యటనలో ఉన్న సిఎం సమక్షంలో టోక్యో లో త్రైపాక్షిక ఒప్పందాలపై ప్రభుత్వ అధికారులు , సంస్థల ప్రతినిధులు సంతకాలు చేశారు. ఎన్‌టిటి డేటా, కెయిసా సంస్థలు సంయుక్తంగా రూ.10,500 కోట్ల పెట్టుబడితో ఎఐ డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. అంతేకాక రుద్రారంలో రూ.562 కోట్లతో మరో పరిశ్రమ ఏర్పాటుకు తోషిబా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కూడా సిఎం సమక్షంలో జరిగింది. తోషిబా అనుబంధ సంస్థ టిటిడిఐ ప్రతినిధులు ఎంఓయుపై సంతకాలు చేసినట్లు సమాచారం. విద్యుత్ సరఫరా, పంపిణి రంగంలో పెట్టుబడులు, ఆవిష్కరణలకు ఈ ఒప్పందం జరిగింది.
జపాన్‌లోని పలు దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో సిఎం రేవంత్‌రెడ్డి బృందం సమావేశమైంది. టోక్యోలో నిర్వహించిన ఇండియా-జపాన్ భాగస్వామ్య రోడ్‌షో లో సిఎం పాల్గొన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి టోక్యో నుండి చాలా నేర్చుకున్నానని ఈ సందర్భంగా సిఎం వ్యాఖ్యానించారు. భారత్, జపాన్ కలిసి ప్రపంచానికి అద్భుతమైన భవిష్యత్ నిర్మిద్దామని పిలుపునిచ్చారు.