నాంప‌ల్లి కోర్టుకు అల్లుఅర్జున్‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): సంథ్య థియేట‌ర్ తొక్కిస‌లాట ఘ‌ట‌న కేసులో బ‌న్నీకి నాంప‌ల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసిన విష‌యం తెలిసిందే. శ‌నివారం మ‌ధ్యాహ్నం అల్లు అర్జున్ కోర్టుకు హాజ‌ర‌య్యారు. ఆయ‌న మామ చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డితో వ‌చ్చి.. బెయిల్ పూచీక‌త్తు ప‌త్రాలు న్యాయ‌మూర్తికి అంద‌జేశారు. రూ.50వేలు చొప్పున రెండు పూచీక‌త్తులు స‌మ‌ర్పించాల‌ని కోర్టు ఆదేశించింది. అదేవిధంగా సాక్షుల‌ను ప్ర‌భావితం చేయొద్దని ష‌రతుల‌తో కూడిన బెయిల్‌ను శుక్రవారం కోర్టు మంజూరు చేసింది. మంజూరు చేసింది. రెండు నెల‌ల‌పాటు ప్ర‌తి ఆదివారం చిక్క‌డ‌ప‌ల్లి పోలీసుల ముందు వ్య‌క్తిగ‌తంగా హాజ‌రు కావాల‌ని ష‌ర‌తు విధించింది.

Leave A Reply

Your email address will not be published.