Hyderabad: న‌గ‌రంలో బోనాలు..

హైద‌రాబాద్ (CLiC2NEWS): న‌గ‌రంలో బోనాల జాత‌ర‌ అంగ‌రంగ వైభంగా జ‌రుగుతున్నాయి. అమ్మ‌వారి దేవాల‌యాల‌న్నీ భ‌క్తులతో కిట‌కిట‌లాడుతున్నాయి. హైద‌రాబాద్‌లోని లాల్ ద‌ర్వాజా సింహ‌వాహిని మ‌హంకాళి అమ్మ‌వారికి డిసిఎం భ‌ట్టి విక్ర‌మార్క‌, పొన్నం ప్ర‌భాక‌ర్‌, కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించారు. హ‌రియాణా గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ‌, టిటిడి ఛైర్మ‌న్ బిఆర్ నాయుడు, ఎమ్మెల్సీ క‌విత సింహ‌వాహిని అమ్మ‌వారిని ద‌ర్శించుకున్నారు.

లాల్ ద‌ర్వాజ సింహ‌వాహిని అమ్మ‌వారు

 

కేంద్ర బొగ్గు గ‌నుల శాఖ మంత్రి కిష‌న్ రెడ్డి అంబ‌ర్‌పేట మ‌హాకాళి అమ్మ‌వారిని ద‌ర్శించుకున్నారు. న‌గ‌ర్ మేయ‌ర్ గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మి అమ్మ‌వారి ద‌ర్శించుకుని ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించారు.

 

Leave A Reply

Your email address will not be published.