ట్యాంక్‌బండ్‌పై కొత్త కారు బీభత్సం
![](https://clic2news.com/wp-content/uploads/2023/07/car-accidnet-in-tankbund-copy.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలోని ఎన్టీఆర్ మార్గ్ సమీపంలో కొత్తకారు బీభత్సం సృష్టించింది. హుస్సేన్ సాగర్ గ్రిల్స్‌ను బలంగా ఢీకొట్టి ఆగిపోయింది. కాని అందులో ఉన్న వారికి మాత్రం ఎటువంటి ప్రమాదం జరగలేదు. ప్రమాదసమయంలో ఎయిర్ బెలూన్‌లు తెరుచు కోవడం వలన వారు క్షేమంగా బయటపడ్డారు. కానీ వారిద్దరూ పరారైనట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్రేన్ సహాయంతో కారును తొలగించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.