Hyderabad: తొలి మ‌హిళా ఎస్‌హెచ్ఓగా సిఐ మ‌ధుల‌త‌

హైద‌రాబాద్(CLiC2NEWS): న‌గ‌రంలో తొలిసారిగా ఓ మ‌హిళా సిఐకి అరుదైన గౌరవం ద‌క్కింది. అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్సవం సంద‌ర్భంగా ఒక మ‌హిళా సిఐని హైద‌రాబాద్ పోలీసు క‌మిష‌న‌రేట్ ప‌రిధిలో లాలాగూడ పోలీసు స్టేష‌న్ ఎస్‌హెచ్ ఓ గా నియ‌మించారు. రాష్ట్ర హోంమంత్రి మ‌హ‌మూద్ అలీ, పోలీసు క‌మిష‌న‌ర్ సివి ఆనంద్ స‌మ‌క్షంలో సిఐ మ‌ధుల‌త బాధ్య‌తలు స్వీక‌రించారు. ఈమె సౌత్‌జోన్ ప‌రిధిలోని పాత బ‌స్తీ ఉమెన్ పిసిలో సిఐగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. ఈసంద‌ర్భంగా మ‌ధుల‌త సిపి సివి ఆనంద్‌కు ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

సిపి సివి ఆనంద్ మాట్లాడుతూ.. మ‌హిళ‌ల‌కు స‌రైన స్థానం, గౌర‌వం ఇవ్వాల‌ని అన్నారు. ఒక మ‌హిళ ఎస్‌హెచ్ ఓగా ఎందుక ఉండ‌కూడ‌ద‌నే ఆలోచ‌న‌వ‌చ్చింది. అందుకే అంత‌ర్జాతీయ మ‌హిలా దినోత్స‌వం రోజున ఒక మ‌హిళా ఆఫీస‌ర్‌ను ఎస్‌హెచ్ ఓగా నియ‌మించాం. మ‌హిళులు ఉన్న‌త స్థాయికి ఎద‌గాల‌ని సివి ఆనంద్ పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.