టిహ‌బ్ 2ను ప్రారంభించిన సిఎం కెసిఆర్‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): న‌గ‌రంలో మ‌రో కీల‌క ఘ‌ట్టం ఆవిష్కృత‌మైంది. తెలంగాణ ముఖ్య‌మంత్రి కెసిఆర్ మంగ‌ళ‌వారం టిహ‌బ్‌ను ప్రారంభించారు. ఒకేసారి నాలుగు వేల‌కుపైగా స్టార్ట‌ప్‌లు  నిర్వ‌హించేందుకు వీలుగా నిర్మించిన ఫెసిలిటి సెంట‌ర్ ప్ర‌పంచంలోనే అతిపెద్ద ఆవిష్క‌ర‌ణ‌ల ప్రాంగ‌ణం టిహ‌బ్‌. హైద‌రాబాద్ రాయ‌దుర్గంలోని నాలెడ్జి సిటీలో రూ. 400 కోట్ల‌తో రాష్ట్ర ప్ర‌భుత్వం దీన్ని నిర్మించింది.

ఈ సంద‌ర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ.. యువ‌భార‌త్ సామ‌ర్థ్యం తెల‌పాల‌నే టిహ‌బ్ నెల‌కొల్పామ‌ని సిఎం కెసిఆర్ అన్నారు. దీనిని స్థాపించాల‌నే ఆలోచ‌న ఎనిమిదేళ్ల క్రిత‌మే అంకురార్ప‌ణ జ‌రిగింద‌ని, 2015లో టిహ‌బ్ మొద‌టి ద‌శ ప్రారంభించామని కెసిఆర్ తెలిపారు. మ‌న ఆర్ధిక వ్య‌వ‌స్థ‌కు అంకురాలు దోహ‌దం చేస్తాయ‌ని, అంకురాల ద్వారా అపార‌మైన ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు ల‌భిస్తాయ‌ని అన్నారు. టిహ‌బ్ ఏర్పాటుకు కృషి చేసిన మంత్రి కెటిఆర్‌, ఐటిశాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి జ‌యేశ్ రంజ‌న్‌కు అభినంద‌న‌లు తెల‌పారు. టిహ‌బ్ ద్వారా అత్యున్న‌త ప్ర‌మాణాల‌తో సేవ‌లు అందుతాయ‌ని, దీని ద్వారా తెలంగాణ ఖ్యాతి మ‌రింత పెరుగుతుంద‌ని సిఎం అన్నారు.

టిహ‌బ్‌-2 ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా కీనోట్ సెష‌న్‌కు ముఖ్యతిథిగా రానా ద‌గ్గుపాటి హాజ‌ర‌య్యారు. సినీతార‌లు, క్రీడాకారుల‌తో పాటు ఔత్సాహిక పారిశ్రామిక వేత్త‌ల‌తో హైద‌రాబాద్‌కు మరింత గుర్తింపు ల‌భిస్తుంద‌ని రానా అన్నారు. స్టార్ట‌ప్ ఎకోసిస్ట‌మ్ అభివృద్ధి కోసం మంత్రి కెటిఆర్ కెంతో కృషిచేశార‌న్నారు.

Leave A Reply

Your email address will not be published.