Hyderabad: లిల్లీ ఫార్మా కంపెనీ ప్రారంభించిన సిఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలోని గచ్చిబౌలిలో లిల్లీ ఫార్మా కంపెనీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా సిఎం మాట్లాడుతూ.. లైఫ్ సైన్సెస్ కంపెనీలకు హైదరాబాద్ రాజధానిగా ఎదిగిందన్నారు. హైదరాబాద్ కేంద్రంగా తయారైన ఔషధాలు, టీకాలు చాలా దేశాలకు ఎగుమతి అవుతున్నాయన్నారు. ఫార్మా కంపెనీలకు ప్రత్యేక జీనోమ్ వ్యాలీ ఇక్కడ ఉందని సిఎం పేర్కొన్నారు.
అమెరికాకు చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీ లిల్లీని సిఎం సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు. శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు అనువైన వాతావరణం ఉందన్నారు. రైజింగ్ తెలంగాణ 2047 లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని.. మెడ్ టెక్నాలజికి రాష్ట్రం ప్రత్యేకమైన హబ్‌గా ఎదుగుతోందని మంత్రి పేర్కొన్నారు.
తప్పక చదవండి: 72 గంటల నిరాహార దీక్షను చేపట్టిన ఎమ్మెల్సీ కవిత