వ‌ర్షాకాలానికి సంబంధించి న‌గ‌రంలో చేప‌ట్ట‌వ‌ల‌సిన ప్ర‌ణాళిక‌పై సిఎం స‌మీక్ష

హైద‌రాబాద్ (CLiC2NEWS): న‌గరానికి చెందిన వివిధ విభాగాల‌ను ఒకే గొడుగు కింద‌కు తెస్తూ విప‌త్తు నిర్వ‌హ‌ణ వ్య‌వ‌స్థ‌ను రూపొందించాల‌ని ముఖ్య‌మంత్రి ఆదేశించారు. బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంట‌ర్‌లో సిఎం అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా సిఎం మాట్లాడుతూ.. హైద‌రాబాద్ న‌గ‌ర ప్ర‌తిష్ట దెబ్బ‌తినేలా వ్య‌వ‌హ‌రిస్తే స‌హించేది లేద‌ని.. నిర్లక్ష్యం విహిస్తే వేటు త‌ప్ప‌ద‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. ప‌నిచేసేవారిని ప్రోత్స‌హిస్తామ‌న్న సిఎం .. వారికి ఉన్న‌త స్థానం క‌ల్పిస్తామ‌ని భ‌రోసా ఇచ్చారు.

న‌గ‌రంలో కేవ‌లం వ‌ర్షాకాలంలోనే కాకుండా 365 రోజులు ప‌నిచేసేలా వ్య‌వ‌స్థ‌ను సంస్క‌రించాలని సిఎం అన్నారు. ఒక్కో విభాగం నుండి ఒక్కో అధికారి బాధ్య‌త వ‌హిస్తూ.. జూన్ 4 లోగా పూర్తి ప్ర‌ణాళిక సిద్ధం చేయ‌మ‌న్నారు. నాలాల పూడిక‌తీత‌లో నిర్ల‌క్ష్యం వ‌ద్దిని.. ఓపెన్ సెల్లార్ గుంత‌ల వ‌ద్ద బారికేడ్లు ఉండేలా చ‌ర్యలు తీసుకోవాల‌న్నారు. వ‌ర‌ద తీవ్ర‌త ఎక్కువ‌గా ఉండే ప్రాంతాల్లో శాశ్వ‌త ప‌రిష్కారం కోసం ప్ర‌ణాళిక‌లు సిద్దం చేయాల‌ని, విద్యుత్ స‌మ‌స్య‌లు తలెత్త‌కుండా చూడాల‌న్న సిఎం.. ఎన్నిక‌ల కోడ్ ముగిస‌న త‌ర్వాత ఆక‌స్మిక త‌నిఖీలు నిర్వ‌హిస్తామ‌ని అధికారుల‌కు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.