డ్రగ్స్ కేసుపై సిపి సివి ఆనంద్ అత్యవసర భేటీ..

హైదరాబాద్ (CLiC2NEWS): బంజారాహిల్స్‌లోని రాడిసన్ హోటల్ పుడింగ్ అండ్ మింక్ పబ్‌లో డ్రగ్స్, ఇతర మత్తు పదార్ధాలు లభ్యమయ్యాయి. పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. పబ్‌నిర్వాహకుడు అభిషేక్, ఈవెంట్ మేనేజర్ అనిల్, విఐపి మూమెంట్ చూసే కునాల్, డిజె ఆపరేటర్ వంశీధర్‌రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పబ్‌లో మొత్తం 148 మందిని గుర్తించారు. అందులో 20 మంది సిబ్బంది, పురుషులు 90 మంది, మహిళలు 38 మంది ఉన్నారు. పబ్‌కు 24 గంటల అనుమతి ఉందని చెప్పి కస్టమర్లను ఆహ్వానించారు.
పబ్‌లో జరిగిన లేట్‌నైట్ పార్టీలో పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో గాయకుడు, బిగ్‌బాస్ విజేత రాహుల్ సిప్లిగంజ్ నటి నిహారిక, మరికొందరు సినీ ప్రముఖుల పిల్లలు ఉన్నారు.
పబ్‌లో డ్రగ్స్ బయటపడటంతో తెలంగాణ పోలీసులు సీరియస్‌గా తీసుకుకుని దర్యాప్తు చేస్తున్నారు. డ్రగ్స్ కేసుపై పోలీసు అధికారులతో నగర సిపి సివి ఆనంద్ అత్యవసర సమావేశం నిర్వహించారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌రిపోర్టు కోసం పంపారు. పోలీసులతో కలిపి నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. బంజారాహిల్స్ సిఐ శివచంద్రను సిపి ఆనంద్ సస్పెండ్ చేశారు. ఎసిపి సదర్శన్‌కు ఛార్జిమెమొ ఇచ్చారు. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాల్సిందిగా ఎసిపిని సిపి ఆదేశించారు.