మీరు సైకిల్‌పై ఆఫీసుకు వెళుతున్నారా.. సత్కారం మీకే
హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలో సైకిల్‌పై ఉద్యోగాలకు వెళ్లొచ్చే వారిని సత్కరించాలని నిర్ణయించింది హైదరాబాద్ సైక్లిస్టు గ్రూప్ సంస్థ. సైకిల్ తొక్కు.. ఫిట్‌గా ఉండు అనే వినూత్న కాన్సెప్ట్‌తో సైక్లింగ్‌ను ప్రోత్సహించాలని ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మియాపూర్‌లో ఉంటున్న కున్ హ్యూండాయ్ కంపెనీ ఉద్యోగి జనార్ధన్ సైకిల్‌పైనే కార్యాలయానికి వెళ్తుంటారు. ఆయనను ఈ సంస్థ అవార్డుతో సత్కరించింది. ఈ సంస్థ చేపట్టిన కార్యక్రమాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న చెన్నైకి చెందిన ఓ ఇటి సంస్థ తమ వద్ద కూడా సైక్లింగ్ చేసే వారున్నారని.. తమనూ సత్కరించాలని కోరారు. వెంటనే స్పందించిన హైదరాబాద్ సైక్లిస్టు గ్రూప్ వారిని కూడా సత్కరించింది. ఐలవ్ సైక్లింగ్ లోగోలతో కూడిన అవార్డును అందజేస్తారు. ఇంకెందుకు ఆలస్యం మీలో కూడా సైకిల్‌పై ఉద్యోగాలకు వెళ్లేవారుంటే వివారలు అందజేయండి.. సత్కారాలు పొందండి.