రాష్ట్రంలో మరోసారి టెట్ నిర్వహణ..

హైదరాబాద్ ():
తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహించాలని మంత్రి వర్గ ఉప సంఘం నిర్ణయించింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం శుక్రవారం సమావేశమయింది. ఈ సమావేశంలో విద్యాశఖలో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలతో పాటు టీచర్ పోస్టుల భర్తీ, మన ఊరు-మన బడిపురోగతిపై చర్చించినట్లు సమాచారం. రాష్ట్రంలో చివరిసారిగా విద్యాశాఖ గత సంవత్సరం జూన్ 12న టెట్ నిర్వహించింది.