కొవిడ్ కొత్త వేరియంట్‌పై ఆందోళన వద్దు: ఫీవర్ ఆస్పత్రి సూపరింటెండెంట్
హైదారబాద్ (CLiC2NEWS): కొవిడ్ కొత్త వేరియంట్‌పై ప్రజలు ఆందోళన చెందొద్దని ఫీవర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ తెలిపారు.
దేశంలో మళ్లీ కరోనా పంజా విసురుతుంది. కొవిడ్ కొత్త వేరియంట్ జెఎన్.1 వైరస్ వేగంగా వ్యప్తి చెందుతున్నట్లు తెలుస్తోంది. ఈ వైరస్ ప్రభావం బిపి, కడ్నిలపై ఉంటుందని వైద్యులు తెలుపుతున్నారు. ఇప్పటికే దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మార్గదర్శకాలు విడుదల చేశాయి. ఈక్రమంలో తాజాగా నగరంలోని ఫీవర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్.. కొవిడ్ కేసులు పెరుగుతున్నప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఫీవర్ ఆస్పత్రికి వచ్చిన వారిలో నాలుగురికి పాజిటివ్ వచ్చిందన్నారు. అయితే జెఎన్.1 అవునా.. కాదా అనేదాని కోసం నమూనాలను గాంధీ ఆస్పత్రికి పంపించామని తెలిపారు.
బిపి, కిడ్ని, గర్భిణులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి ఈ వైరస్ సోకే అవకాశం ఉందన్నారు. నగరంలోని ఉస్మానియా, గాంధీ, నీలోఫర్, ఫీవర్ ఆస్పత్రులలో ప్రత్యేక పడకల సదుపాయాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించినట్లు ఆయన తెలిపారు. ఆ విధంగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పండుగుల సీజన్ ఉన్నందున ప్రతి ఒక్కరు మార్గదర్శకాలను పాటించాలన్నారు.
రాష్ట్రంలో కొత్తగా ఆరు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు 19 కేసులు నమోదయ్యాయి.ఇంకా 54 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులిటెన్‌లో పేర్కొంది.