జలమండలి కార్యాలయంలో ఘనంగా ఈద్ మిలాప్

హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలోని ఖైరతాబాద్ జలమండలి కార్యాలయంలో ఈద్ మిలాప్ ఘనంగా జరిగింది. జలమండలి మైనారిటీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ (మేవా) ఆధ్వర్యంలో బుధవారం జరిగిన ఈ కార్యక్రమానికి మలక్ పేట్ ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల, జలమండ లి ఎండి దానకిశోర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారు మాట్లాడుతూ.. ముస్లిం ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు. జలమండలిలో మతాలకతీతంగా అన్ని పండగలను కలిసి కట్టుగా జరుపుకుంటామని అన్నారు. మైనారిటీ ఉద్యోగులకు అన్ని విధాలా అండగా ఉంటామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఈడీ డా.ఎం.సత్యనారాయణ, ఈఎన్సీ, ఆపరేషన్స్ డైరెక్టర్-1 అజ్మీరా కృష్ణ, ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీధర్ బాబు, టెక్నికల్ డైరెక్టర్ రవికుమార్, వాటర్ వర్క్స్ ఎంప్లాయిస్ యూనియన్, తెలంగాణ అధ్యక్షుడు రాంబాబు యాదవ్, జనరల్ సెక్రటరీ జయరాజ్, మేవా అధ్యక్షుడు ఖాజా జవహర్ అలీ, జనరల్ సెక్రటరీ సయ్యద్ అక్తర్ అలీ, వర్కింగ్ ప్రెసిడెంట్, సీజీఎం మహ్మద్ అబ్దుల్ ఖాదర్, నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.