ఆందోళన విరమించిన సినీ కార్మికులు..
హైదరాబాద్ (CLiC2NEWS): వేతనాలు పెంచాలని ఆందోళన చేపట్టిన సినీ కార్మికులు ఎట్టకేలకు సమ్మె విరమించారు. వేతనాల పెంపుపై నిర్మాతల మండలి నుంచి స్పష్టమైన హామీ రావడంతో రేపటి నుండి సినిమా చిత్రీకరణలకు హాజరుకానున్నట్లు ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు వెల్లడించారు. రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చొరవతో సిని కార్మిక సంఘాలు, నిర్మాతల మండలితో చర్చాలు జరిపాయి. సుమారు 2 గంటల పాటు చర్చలు నిర్వహించారు. కార్మికుల వేతనాలపై దిల్ రాజు అధ్యక్షతన సమన్వయ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు నిర్మాతల మండలి ప్రకటించింది. శుక్రవారం సమన్వయ కమిటీ సమావేశంలో చర్చించి వేతనాలపై తుది నిర్ణయం తీసుకుంటాని వెల్లడించింది.