కుషాయిగూడలో విషాదం.. మంటలలో చిక్కుకుని చిన్నారి సహా ముగ్గురు సజీవ దహనం..
హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలోని కుషాయగూడలో భారీ అగ్నిప్రమాదం సంభవించి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. టింబర్ డిపోలో మంటలు చెలరేగి పక్కనే ఉన్న భవనంలోకి వ్యాపించాయి. భవనంలో నివసించే భార్యభర్తలు వారి చిన్న కుమారుడు సజీవ దహనమయ్యారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. భవనంలోని రెండో అంస్తులో ఉంటున్న సూర్యాపేట వాసి గ్యాస్ ఏజెన్సీలో డెలివరీ బాయ్‌గా పనిచేసున్నాడు. అతని భార్య, చిన్న కుమారుడు మంటల్లో చిక్కుకుపోయి మృత్యువాత పడ్డారు. వారి పెద్ద కుమారుడు మేనత్త ఇంటికి వెళ్లడంతో ప్రమాదం నుండి తప్పించుకోగలిగాడు. నాలుగు నెలల క్రితమే వారు ఆ భవనంలోకి అద్దెకు వచ్చినట్లు సమాచారం.
ఘటనా స్థలాన్ని మంత్రులు మహమూద్ ఆలీ, మల్లారెడ్డి, ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పరిశీలించారు. మృతుల కుంటుంబాలకు రూ. 43 లక్షల పరిహారం అందేలా చూస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ముందుగా రూ. 25 లక్షల విలువైన చెక్కులు, నగదు అందించారు.