ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం.. కాల్ సెంటర్ నిర్వాహకులు అరెస్టు
హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలో ఉద్యోగం ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న వారిని పోలీసులు అరెస్టు చేశారు. పంజాగుట్టలో కాల్ సెంటర్ నిర్వహిస్తూ.. డేటా ఎంట్రీ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ.. మోసం చేస్తున్న వారిని అరెస్టు చేసినట్లు సిసిఎస్ డిసిసి స్నేహమిశ్రా తెలిపారు. ఈ కేసులో ముగ్గురు కాల్ సెంటర్ నిర్వాహకులను, వారితో పాటు మొత్తం 32 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుండి నాలుగు బైక్‌లు, ఒక బిఎండబ్ల్యూ కారు, రూ. 1,35,000 ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు బాధితులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కార్ణటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో బాధితులు ఉన్నట్లు సమాచారం. బాధితుల నుండి రూ. 50 లక్షల వరకు నగదు సేకరించినట్లు .పోలీసులు వెల్లడించారు.