తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ
హైదరాబాద్ (CLiC2NEWS): రానున్న 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కోస్తాంధ్ర-ఒడిశాను ఆనుకుని అల్పపీడన ప్రాంతం ఏర్పిడినట్లు తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురువనున్నట్లు పేర్కొంది. జులై 25వ తేదీ వరకు భారీ వర్షసూచన ఉన్నట్లు తెలిపింది.
భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులకు వెంటనే స్పందించాలని అధికారులను ఆదేశించారు. మరో 2,3, రోజులు వర్షాలు కురుస్తాయని. హుస్సేన్ సాగర్ భారీ వరద దృష్ట్యా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు.
[…] తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. వ… […]