సంధ్య థియేటర్ ఘటన.. శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అర్జున్
హైదరాబాద్ (CLiC2NEWS): సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడ్డ శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు అల్లుఅర్జున్ కిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను పరామర్శించారు. బన్నీతో పాటు నిర్మాత దిల్ రాజు ఉన్నారు.శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి బన్నీ ఆస్పత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. శ్రీతేజ్ తండ్రి భాస్కర్‌తో కూడా మాట్లాడారు. అల్లు అర్జున్ ఆస్పత్రికి వస్తున్న నేపథ్యంలో పోలీసులు ఆస్పత్రి ప్రాంగణంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
పుష్ప2 సినిమా బెనిఫిట్‌షో రోజున సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో రేవతి ప్రాణాలు కోల్పోయారు. ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నాడు. ఈ ఘటనపై హీరో అల్లు అర్జున్, థియేటర్ యాజమాన్యం..మరికొందరిపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు వెళ్లొద్దని లీగల్ టీమ్ బన్నికి చెప్పడంతో ఆయన రాలేదు. తాజాగా పోలీసులకు సమాచరం ఇచ్చిన తర్వాత ఆస్పత్రికి వెళ్లారు. ఇటీవల అల్లుఅర్జున్ శ్రీతేజ్ కుటుంబానికి రూ.కోటి, పుష్ప2 నిర్మాతలు, దర్శకుడు సుకుమార్ చెరో రూ. 50లక్షల ఆర్ధిక సాయం అందజేశారు.
తప్పక చదవండి: అల్లు అర్జున్‌కు రెగ్యులర్ బెయిల్ మంజూరు: నాంపల్లి కోర్టు