IND vs NZ: శుభ్‌మన్‌గిల్ డబుల్ సెంచరీ..

హైదరాబాద్ (CLiC2NEWS): ఉప్పల్ వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య వన్డే మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసినదే, టీమ్ ఇండియా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 349 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ 149 బంతుల్లో 208 పరుగులు చేశాడు. యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ అత్యంత వేగంగా వన్డేల్లో 1000 పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డు సాధించాడు. కొహ్లీ 24 వన్డేల్లో సాధించిన ఈ రికార్డును.. గిల్ 19 వన్డేల్లో సాధించాడు. ఇక అంతర్జాతీయంగా 18 వన్డేల్లో 1000 పరుగులు రికార్డు సాధించిన పాక్ ఆటగాడు ఫఖర్ మొదటి స్థానంలో ఉన్నాడు.
350 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 44 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసింది. మైఖేల్ 106 పరుగులు, శాంటర్న్ 52 పరుగులతో రాణిస్తున్నారు.