అనాటి పోరాట యోధుల్ని స్మరించుకుందాం..
అనాటి ఉజ్వల ఉద్యమం తెలంగాణ కీర్తీ కిరీటంలో కలికితురాయి: సిఎం కెసిఆర్

హైదరాబాద్ (CLiC2FNEWS): తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాలు హైదరాబాద్‌లో పబ్లిక్ గార్డెన్‌లో జరిగాయి ఈ వజ్రోత్సవ వేడుకల్లో సిఎం కెసిఆర్ జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం ప్రజలను ఉద్దేశించిన ప్రసంగించారు.
“1948 సెప్టెంబరు 17న హైదరాబాద్ సువిశాల భారతదేశంలో అంతర్భాగంగా మారింది. రాచరిక పరిపాలన నుంచి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందింది. అందుకే ఈ సంర్భంగా జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నాం. అనాడు ప్రజా పోరాటాలు చేసిన మహనీయులందరినీ స్మరించుకుందాం. వారందరి కృషితోనే ఇవాళ మనం చూస్తున్న భారతదేశం ఆవిష్కృతమైంది. అనాటి ఉజ్వల ఉద్యమ సందర్భం తెలంగాణ కీర్తీ కిరీటంలో కలికితురాయిగా నిలిచిపోయిందని కెసిఆర్ తెలిపారు. స్వాతంత్ర్యానికి పూర్వమే హైదరాబాద్ రాష్ట్రం ఎంతో అభివృద్ధిలో ఉండేది. రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ పేరుతో హైదరాబాద్ రాష్ట్రాన్ని బలవంతంగా ఆంధ్రప్రదేశ్‌లో కలిపారు. ఆ విలీనంపై హైదరాబాద్ ప్రజలు అప్పుడే ఆందోళన చెందారు. ఆనాటి ఏమరపాటు వల్ల 58 యేళ్లు ఎంతో నష్టపోయాం. సుధీర్ఘ పోరాటం తర్వాత మళ్లీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించింది. ఇవాళ రాష్ట్రం అన్ని రంగాల్లోముందుంది. కొందరు చరిత్రను వక్రీకరించి మలినం చేసేందుకు కుట్రలు చేస్తున్నారు. రెప్పపాటు కాలం ఆదమరిచినా విచ్ఛిన్నకర శక్తుల నుంచి ప్రమాదం పొంచి ఉంది.“ అని కెసిఆర్ అన్నారు.