పరిశోధన కేంద్రాల ఏర్పాటుకు హైదరాబాద్ గమ్య స్థానం: కెటిఆర్
హైదరాబాద్ (CLiC2NEWS): ప్రపంచ స్థాయి సంస్థల పరిశోధనా కేంద్రాల ఏర్పాటుకు హైదరాబాద్ గమ్యస్థానంగా ఎదుగుతోందని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. గచ్చిబౌలిలోని ధర్మో ఫిషర్స్ ఇంజినీరింగ్ ఆర్ అండ్ డి సెంటర్ ప్రారంభోత్సవంతో కెటిఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం 15 మిలియన్ డాలర్ల పెట్టుబడితో ఈ ఆర్ అండ్ డి సెంటర్ 450 మంది ఇంజినీర్లకు ఉపాధి కల్పించబోతోందని ప్రకటించారు. లైఫ్ సైన్సెస్, ఇన్నోవేషన్ రంగాల్లో హైదరాబాద్ స్థానాన్ని సుస్థిరం చేసేలా ప్రభుత్వం తన కృషి కొనసాగిస్తుందని కెటిఆర్ వివరించారు.
థర్మోఫిషర్స్ సంస్థ పరిశోధన కోసం ఏటా దేశవ్యాప్తంగా 1.4 బిటియన్ డాలర్లు వెచ్చిస్తోంది. ఇండియా ఇంజనీరింగ్ సంస్థ ఇప్పటికే ఉత్పత్తి, భూ, నీటి వనరులపై పరిశోధన చేస్తోందని తెలిపారు. హైదరాబాద్‌కు ప్రత్యేకత ఉందని, లైఫ్ సైన్సెస్‌తో డేటా సైన్స్, ఉత్తర భారతం-దక్షిణ భారతం కలుస్తామని, కొత్త ఉత్పత్తులు, ల్యాబ్ పరికారాలు, విశ్లేషాత్మక పరిష్కారాలకు కేంద్రంగా ఉందని కెటిఆర్ అన్నారు. గత నెలలో బోస్టన్‌లోని థర్మో ఫిషర్స్ కేంద్ర కార్యాలయానికి వెళ్లి ప్రతివిధులను కలిశానని, అప్పుడు తన గ్రాడ్యుయేషన్ రోజులు గుర్తొచ్చాయిని అన్నారు. నేను కూడా బయోటెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ చేశాను అని చెప్పారు. ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు, ఎంపి రంజిత్ రెడ్డి పాల్గొన్నారు.