రహస్య కెమెరాతో ఇంటి యజమాని నిర్వాకం
హైదరాబాద్ (CLiC2NEWS): ఇంటిలో రహస్యకెమెరా అమర్చి యువతులను తన గదినుండి వీక్షిస్తున్న ఇంటి యజమానిని జూబ్లిహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఓ ఇంటి యజమాని యువతులకు గదిని అద్దెకిచ్చాడు. వారి గదిలో రహస్య కెమెరాను అమర్చి.. దానిని తన గదిలోని కంప్యూటర్, మోబైల్‌కు అనుసంధానం చేసుకున్నాడు. యువతులు గదిలో ఉన్నపుడు వారిని గమనిస్తూ ఉండేవాడు. అనుమానం వచ్చిన యువతి గదిలో అమర్చిన మీటరును తీసి చూడగా దానిలో కెమెరా బయటపడింది. దీంతో వెంటనే జూబ్లిహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇంటి యజమానిని అదుపులోకి తీసుకున్ఆరు. అతని వద్ద నుండి సెల్‌ఫోన్, కెమెరా, డివిఆర్‌లను స్వాధీనం చేసుకున్నారు.