‘ఖుషి’ సినిమాలోని టైటిల్ సాంగ్ రిలీజ్
![](https://clic2news.com/wp-content/uploads/2023/07/KUSHI-MOVIE.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): శివ నిర్వాణ దర్శకత్వంలో రూపు దిద్దుకుంటున్న చిత్రం ఖుషి. కశ్మీర్ నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథా ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్నవిషయం తెలిసిందే. ఈ సినిమాను సెప్టెంటర్‌లో విడుదల చేయాలనుకంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే రెండు పాటలు విడుదలయ్యాయి. ఇవి మంచి ఆదరణను సొంతం చేసుకున్నాయి. తాజాగా ఈ చిత్రం నుండి 3వ సాంగ్(టైటిల్ సాంగ్) ను శుక్రవారం చిత్రబృందం విడుదల చేసింది. ఈ పాటకు శివ నిర్వాణ లిరిక్స్ సమకూర్చగా హిషామ్ అబ్దుల్ వాహబ్ ఈ పాటను ఆలపించారు.