నేడు కృష్ణా యాజమాన్య బోర్డు సమావేశం..
హైదరాబాద్ (CLiC2NEWS): నేడు కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు సమావేశం కానుంది. కెఆర్ ఎంబి ఛైర్మన్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాల అధికారులు హజరుకానున్నారు. సమావేశానికి సంబంధించిన ఎజెండా అంశాలను ఇరు రాష్ట్రాలకు అందజేశారు. బోర్డు వార్షిక బడ్జెట్‌తో పాటు పరిపాలన, ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించి విధివిధానాలు, 2022-23 సంబంధించిన నీటి వాటా ఒప్పందం అంశాన్ని పొందుపరిచారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య 50:50 నిష్పత్తిలో కృష్ణా జలాల తాత్కాలిక పంపకాలు జరపాలని రాష్ట్రం చేసిన విజ్ఞప్తిపై నిర్ణయం తీసుకోనుంది. అదేవిధంగా నిధుల కేటాయింపు, ఆర్డీఎస్, శ్రీశైలం, నాగార్జున సాగర్‌లో 15 ఔట్‌లెట్లను బోర్డుకు అప్పగించడంపై చర్చించనున్నట్లు సమాచారం.