కేంద్ర సర్కార్ ఆధ్వర్యలో హైదరాబాద్ విమోచన దినోత్సవం

హైదరాబాద్ (CLiC2NEWS): సెప్టెంబర్ 17 హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని సికిందరాబాద్ పెరేడ్ గ్రౌండ్స్‌లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మంగళశారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు జి కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్, ఎంపీలు ఈటల రాజేందర్, కె. లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి జాతీయ జెండా ఎగరవేసిశారు. అనంతరం భద్రతా బలగాల గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మొదట అమర జవాన్ల స్తూపానికి నివాళులు అర్పించారు.