మూసీ ఉద్ధృతి.. మూసారాంబాగ్ బ్రిడ్జి మూసివేత

హైదరాబాద్ (CLiC2NEWS): మూసీ నదికి వరద పోటెత్తెంది. జంటజలాశయాలతో పాటు గండిపేట చెరువు గేట్లు ఎత్తివేయడంతో మూసీకి ఒక్కసారిగా వరద ఉద్ధృతి పెరిగింది. దీంతో మూసారాంబాగ్ వంతెన పైనుండి నీరు ప్రవహిస్తుండడంతో నిన్న సాయంత్రం నుంచి ట్రాఫిక్ పోలీసులు రాకపోకలు నిలిపివేశారు. రేపు ఉదయం వరకు వంతెనపై నుండి వరద కొనసాగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీంతో ముందస్తు చర్యల్లో భాగంగా అంబర్‌పేట-కాచిగూడ, ముసారాంబాగ్-మలక్‌పేట మార్గాల మధ్య రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. దీంతో దిల్‌సుఖ్నగర్, మలక్‌పేట, చాదర్‌ఘాట్, కోఠి రహదారిపై వామనాల రద్దీ భారీగా పెరిగింది. దిల్‌సుఖ్‌నగర్-కోఠి మార్గంలో వెళ్లే వారు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.