రాష్ట్రప‌తి ద్రౌప‌దిముర్ముకు స్వాగ‌తం ప‌లికిన గ‌వ‌ర్న‌ర్, సిఎం

హైద‌రాబాద్ (CLiC2NEWS): భార‌త రాష్ట్రప‌తి ద్రౌప‌ది ముర్ము న‌గ‌రానికి చేర‌కున్నారు. ప్ర‌త్యేక విమానంలో బేగంపేట్ విమానాశ్ర‌యానికి చేరుకున్నారు. రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసౌ సౌంద‌ర‌రాజ‌న్‌, సిఎం రేవంత్ రెడ్డి, డిప్యూటి సిఎం భ‌ట్టి విక్ర‌మార్క విమానాశ్ర‌యంలో రాష్ట్రప‌తి స్వాగతం ప‌లికారు. శీతాకాల విడిది కోసం హైద‌రాబాద్‌కు చేరుకున్న ఆమె బొల్లారంలోని రాష్ట్రప‌తి నిల‌యంలో బ‌స చేయ‌నున్నారు. డిసెంబ‌ర్ 23 త‌ర్వాత తిరిగి ఢిల్లీ బ‌య‌ల్దేరి వెళ్ల‌నున్న‌ట్లు స‌మాచారం.

Leave A Reply

Your email address will not be published.