hyderabad rains: జిహెచ్ఎంసి హెచ్చరిక: 12 గంటల పాటు ఈదురుగాలులతో వర్షం
హైదరాబాద్ (CLiC2NEWS): హైదరాబాద్ నగరంలో రానున్న 12 గంటల పాటు బలమైన ఈదురుగాలులతో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని జిహెచ్ ఎంసి హెచ్చరించింది. ఇవాళ (మంగళవారం) ఉదయం 10.30 నుంచి రాత్రి 10 గంటల వరకు గాలులు కొనసాగుతాయని వెల్లడించింది. ఎక్కువ తీవ్రతతో గాలులు వీస్తాయని.. వీటి ప్రభావంతో చెట్లు విరిగిపడే అవకాశం ఉన్నందున నగర వాసులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఈ మేరకు జిహెచ్ ఎంసి విపత్తు నిర్వహణ విభాగం ట్విట్టర్‌లో పోస్టు చేసింది.
“చెట్ల కింద ఉండొద్దు.. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి. ఎమర్జెన్సీ కోసం డిఆర్ ఎఫ్ బృందాలు అందుబాటో ఉన్నాయి. అవసరమైతే 040-29555500కు కాల్ చేయాలి“ అని జిహెచ్ ఎంసి అధికారులు సూచించారు.