Hyderabad: 19 బాలకార్మికులను రక్షించిన ఆర్పిఎఫ్ పోలీసులు
![](https://clic2news.com/wp-content/uploads/2023/01/SECUNDERABAD-STATION.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అక్రమంగా తరలిస్తున్న 19 బాలకార్మికులను రైల్వే పోలీసులు రక్షించారు. దానాపూర్ ఎక్స్ప్రెస్లో బాలకార్మికులను అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో అప్రమత్తమైన ఆర్పిఎఫ్ పోలీసులు వారిని రక్షించారు. వారిని అక్రమంగా తరలిస్తున్న 10 మంది మధ్యవర్తులను సైతం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. బాలురను చైల్డ్హోమ్కు తరలించారు. వీరిని పరిశ్రమల్లో పనిచేసేందుకు తరలిస్తున్నట్లు సమాచారం.