TMU: నేడు 2 గంటల పాటు ఆర్‌టిసి బస్సులు బంద్
![](https://clic2news.com/wp-content/uploads/2023/08/TSRTC.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శనివారం ఉదయం 2 గంటల పాటు అర్‌టిసి బస్సుల సేవలు నిలిచిపోనున్నాయి. ఆర్‌టిసి బస్సుల బంద్‌కు తెలంగాణ మజ్దూర్ యూనియన్ టిఎంయు పిలుపునిచ్చింది. ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు ఈ బంద్ జరగనున్నట్లు సమాచారం. శనివారం ఉదయం 10 గంటలకు ఆర్‌టిసి కార్మికులందరూ నెక్లెస్ రోడ్డుకు రావాలని కోరింది. 11 గంటలకు రాజ్‌భవన్ వద్ద నిరసన ప్రదర్శన చేపట్టనున్నట్లు సమాచారం. ఇటీవల తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఆర్‌టిసిని ప్రభుత్వం విలీనం చేసిన సంగతి తెలిసిందే. గవర్నర్ అర్‌టిసి బిల్లును ఆమోదించాలని కోరుతూ టిఎంయు నిరసన ప్రదర్శన చేపట్టనుంది.