144 పరుగుల లక్ష్యంతో బరిలోకి సన్‌రైజర్స్
![](https://clic2news.com/wp-content/uploads/2023/04/IPL-IN-UPPAL.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): 144 పరుగుల లక్ష్యంతో సన్‌రైజర్స్ బరిలోకి దిగింది. ఉప్పల్ వేదికగా ఐపిల్ మూడో మ్యాచ్ కొనసాగుతుంది. ఆడిన రెండు మ్యాచ్‌లలో ఓటమి చవిచూసిన సన్‌రైజర్స్.. ఈ సారైనా బోణీ కొట్టాలని క్రికెట్ అభిమానులు ఎదుచూస్తున్నారు. ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్ సన్‌రైజర్స్, పంజాబ్ కింగ్స్‌తో తలపడుతోంది. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్‌లలో పంజాబ్ కింగ్స్ గెలుపొందింది. ముందుగా టాస్ గెలిచి హైదరాబాద్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ 12 ఓవర్లు అయ్యే సరికి 7 వికెట్ల నష్టానికి 77 పరుగులు స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో కింగ్స్ 9 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది.