సన్‌రైజర్స్ హైదరాబాద్ హెడ్ కోచ్‌గా బ్రియన్ లారా..
![](https://clic2news.com/wp-content/uploads/2023/04/SUNRISERS-VS-MUMBAI-INDIANS.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): ఉప్పల్ వేదికగా మంగళవారం సాయంత్రం ఐపిల్ మ్యాచ్ ప్రారంభమైంది. సన్ రైజర్స్ హైదరాబాద్.. వరుసగా ఐదు సార్లు విజయం సొంతం చేసుకున్న ముంబయి ఇండియన్స్ తో తలనపడుతుంది. మొదట టాస్ గెలిచిన సన్ రైజర్స్ మొదట బాటింగ్ చేయాలని నిర్ణయించింది. రెండు జట్లు తమ చివరి మ్యాచ్‌ల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. మరి ఈ పోరులో గెలుపెవరిదో వేచి చూడాలి. సచిన్ టెండూల్కర్ ముంబయి ఇండియన్స్‌కు మెంటర్‌గా వ్యవహరించగా.. వెస్టెండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియన్ లారా సన్ రైజర్స్ హైదరాబాద్‌కు హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు.
హైదరాబాద్: హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఐదెన్ మార్ క్రమ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, హెన్రిచ్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, మార్కొ జాన్‌సెన్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, టి. నటరాజన్.
ముంబయి: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ , కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, డ్యూన్ జాన్ సెన్, జోఫ్రా ఆర్చర్, అర్జున్ టెండూల్కర్, షోకీన్, పీయూశ్ చావ్లా, నెహాల్ వదేరా