హనుమాన్ టీమ్ అద్భుతాన్ని సృష్టించింది: చిలుకూరు ప్రధాన అర్చకులు

హైదరాబాద్ (CLiC2NEWS): హనుమాన్ టీమ్ అద్భుతాన్ని సృష్టించిందని చిలుకూరు బాలాజి ఆలయ ప్రధాన అర్చుకులు రంగరాజన్ అన్నారు. హనుమాన్ సక్సెస్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సినిమా తనకు బాగా నచ్చిందన్నారు. స్వామి నామాన్ని జపిస్తే బుద్ది, బలం, ధైర్యం, నిర్భయత్వాన్ని , శ్రీరామభక్త ఆంజనేస్వామి ప్రసాదిస్తారు. ప్రేక్షకులంతా ఆయన్ని తలచుకునేలా చేసిన ఈ చిత్ర బృందానికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఆర్చకులనేవారు భక్తుల ప్రతినిధిగా గర్భగుడిలోకి వెళ్తారని.. బయటకు వచ్చేటపుడు స్వామివారి ప్రతినిధిగా బయటకు వస్తారన్నారు. ప్రస్తుత రోజుల్లో సమాజానికి విలువైన సినిమాలు అందించాలన్నారు. హనుమాన్ చిత్రంలో ఎక్కడా కూడా అసభ్యత కనిపించలేదని, ఆడవాళ్లను వక్రీకరించి చూపిస్తేనే హిట్ అవుతుందనే దోరణితో ఉన్నవారికి ఇదొక చెంపపెట్టన్నారు.