రాష్ట్రంలో ఏడాదికి రెండుసార్లు టెట్ పరీక్ష

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణలో ఇక నుండి ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఏడాదకి రెండు సార్లు నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏటా జూన్, డిసెంబర్ నెలల్లో పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది.